Stone-pelting at Vasundhara Raje's Gaurav yatra సీఎంకు పరాభవం.. రాళ్లురువ్విన అందోళనకారులు

Stone pelting anti bjp slogans at vasundhara raje s yatra in jodhpur

vasundhra raje, bjp, congress, stone pelting at vasundhra raje, rajasthan cm, Stone pelting, Rajasthan BJP, Congress, National news, Latest news,

Rajasthan Chief Minister Vasundhara Raje faced the rage of protesters during the public meeting in Jodhpur’s Osian, after some people from the Rajput community raised slogans against her.

ముఖ్యమంత్రికి పరాభవం.. రాళ్లురువ్విన అందోళనకారులు

Posted: 08/27/2018 10:29 AM IST
Stone pelting anti bjp slogans at vasundhara raje s yatra in jodhpur

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు చేదు అనుభవం ఎదురైంది. గౌరవ యాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆమెకు జోధ్ పూర్ లో నిరసన సెగలు తగిలాయి. ఆమె పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు అమె పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె పర్యటనలో అమెకు నల్లజెండాలతో తమ వ్యతిరేకతను తెలిపిన పలువరు అందోళనకారులు.. అంతటితో అగకుండా ఆమె బస్సుపై కొందరు రాళ్లు రువ్వారు. అంతేకాదు ఆమె పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభావేదికను కూడా ధ్వంసం చేశారు. దీంతో పర్యటనను రద్దు చేసుకున్న సీఎం ప్రత్యేక విమానంలో జైపూర్ వెళ్లిపోయారు. నిజానికి ఆమె ఆ రాత్రి పిపార్ సిటీలో బస చేయాల్సి ఉంది.

ముఖ్యమంత్రి వసుంధరపై రాళ్లదాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన వెనక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించింది. సీఎం వసుంధర మాట్లాడుతూ తనపై రాళ్ల దాడి వెనక కాంగ్రెస్ హస్తం ఉందని, రాష్ట్రాభివృద్ధి కోసం తన ప్రాణాలైనా ఇస్తానని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, ఇప్పుడు తాము చేస్తుంటే తట్టుకోలేక ఇటువంటి పనులకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ పేరును వసుంధర ప్రస్తావించకపోయినప్పటికీ.. రాళ్లదాడికి పాల్పడిన వారు అశోక్ గెహ్లట్ పేరుతో నినాదాలు చేసినట్టు చెబుతున్నారు.

 సీఎం ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే హీరా లాల్ బిష్ణోయ్ మాట్లాడుతూ... బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. అందుకే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. వసుంధర రాజే బస్సుపై దాడిచేసిన వారికి కాంగ్రెస్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. గెహ్లట్ మాజీ ముఖ్యమంత్రి అని, కాబట్టి అందరికీ ఆ పేరు చిరపరిచితమేనని పేర్కొన్నారు. కాగా, నిరసనకారుల రాళ్ల దాడిలో సీఎం వసుంధర రాజేకు ఎటువంటి గాయాలు కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan CM  Vasundhara Raje  Stone pelting  Rajasthan BJP  Congress  Latest news  

Other Articles