No obstacles can stop Pawan from becoming CM పవన్ కల్యాణ్ ను సీఎం కాకుండా అపలేరు..

Actor suman interesting comments on pawan kalyan

pawan kalyan, janasena, guntur, suman, chief minister, fans, party activists, fortune, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

No obstacles can stop Pawan Kalyan from becoming Andhra Pradesh Chief Minister says senior hero and veteran cine actor suman.

పవన్ కల్యాణ్ ను సీఎం కాకుండా ఎవరూ అపలేరు..

Posted: 08/27/2018 11:13 AM IST
Actor suman interesting comments on pawan kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ ఫవన కల్యాణ్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే శక్తి మాత్రం ఎవరికీ లేదని సీనియర్ సీనీనటుడు హారో సుమన్ అభిప్రాయపడ్డారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వారెందరో దక్షిణాధిలో ముఖ్యమంత్రి పదవులను అలంకరించారని, అలాంటి వారి జాబితాలో త్వరలో పవన్ కల్యాణ్ కూడా చేరడం ఖాయమని చెప్పారు. అయితే ఇందుకు ప్రజాబలం, కార్యకర్తలు, అభిమానుల బలంతో పాటు మరో రెండు బలాలు కూడా కావాలని పేర్కొన్నారు సుమన్.

సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారికి అభిమానులు, ప్రజలు, కార్యకర్తలతో పాటు సదరు సినీనటుల జాతక, గ్రహబలం బాగుండాలని అన్నారు. ఇలా వున్నవారు ముఖ్యమంత్రులు కాగలిగారని, పవన్ కు కూడా అవి బాగుంటే సీఎం అవుతారని సుమన్ అభిప్రాయపడ్డారు. సుమన్ సినీ రంగ ప్రవేశం చేసి 4 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పవన్ చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ప్రసంగాలు ఆకట్టుకునేలా ఉంటున్నాయని ప్రశంసించారు. యువత ఫాలోయింగ్ పవన్‌కు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. అయితే, పవన్ సీఎం కావాలంటే జాతక బలం కూడా ఉండాలని స్పష్టం చేశారు. గ్రహబలం, జాతక బలం బాగున్నవారే ముఖ్యమంత్రులు కాగలిగారని పేర్కొన్న సుమన్.. పవన్ విషయంలోనూ ఇది వర్తిస్తుందన్నారు. ఆయన జాతకం ఎలా ఉందో తెలియదని, అది బలంగా ఉంటే మాత్రం ఆయనను సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని సుమన్ అభిప్రాయపడ్డారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  guntur  suman  chief minister  fans  party activists  fortune  andhra pradesh  politics  

Other Articles