photographer recieves death threat for his creativity ఔవ్వ.. ఇదా ఫోటోగ్రాఫర్ క్రియేటివిటీ..

Bengal turns prude death threats for bridal photographer who shot in the nude

death threat, nude photography, Bengali bride, Facebook, freedom of expression, wedding photography, bridalmakeupshoot, Kolkata, West Bengal, crime

A kolkata photographer has landed in trouble for doing a bold photo shoot. For the last couple of days he is receiving constant threats over phone and social media for 'hurting religious sentiments'.

ఔవ్వ.. ఇదా ఫోటోగ్రాఫర్ క్రియేటివిటీ.. చంపుతామని బెదిరింపులు..

Posted: 08/25/2018 07:12 PM IST
Bengal turns prude death threats for bridal photographer who shot in the nude

ఆ ఫొటోగ్రాఫర్ క్రియేటివిటీకి బాగా పదునుపెట్టాడు. ఇప్పటికే పెళ్లి ఫోటోలు తీయడంతో నిష్ణాతుడిగా గుర్తింపుపొందిన ఈయన.. తొండ ముదిరి ఊసరవెళ్లి అయ్యిందన్నట్లు.. తన క్రీయేటివిటీకి పదను పెడుతూ పెడుతూ.. కొత్త సృజనాత్మకత తీసిన ఫోటో ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎంతలా అంటే నిన్ను చంపేస్తాం.. మా సంప్రదాయాలకు భంగం కలిగేలా.. ఫోటోలు తీస్తావా.? అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అగంతకులు.

ఇంతకీ ఈ ఫోటోగ్రాఫర్ చేసిన తప్పేంటీ.. అంటే ఓ మోడల్‌కు పెద్ద బొట్టు పెట్టి బెంగాళీ పెళ్లి కూతురులా ముస్తాబు చేశాడు. అయితే, ఆమె శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటో తీసి.. తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్ గా మారడంతో బెంగాళీలు ఆ ఫొటోగ్రాఫర్‌పై మండిపడుతున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. కోల్ కతాకు చెందిన ప్రీతమ్‌ మిత్రాకు వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ గా మంచి పేరుంది. మరింత పాపులారిటీ కోసం సరికొత్తగా ఫొటో‌షూట్ చేద్దామని భావించాడు.

ఇందులో భాగంగా మోడల్ తో ‘న్యూడ్ ఫొటో’ తీశాడు. ఆ నగ్న చిత్రంలో మోడల్ ముఖం, వక్షోజాలు కనిపించకుండా తమల పాకులు, జుట్టుతో కవర్ చేయడంతో పాటు చేత్తో మర్మాంగాన్ని కూడా కవర్ చేయించాడు. అయితే, బెంగాళీ నెటిజన్లు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బెంగాలీ వివాహ వ్యవస్థ, హిందువులను అవమానించేలా ఆ ఫొటో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు.. 24 గంటల్లో ఫొటో తొలగించకపోతే చంపేస్తామని పీత్రమ్‌ను హెచ్చరించారు. దీనిపై ప్రీతమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫొటో వల్ల ప్రీతమ్ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles