అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ క్షీణతపై గతంలో ఎన్నో ప్రసంగాలు చేసి దానిని కూడా ఎన్నికల ప్రచారాంశంగా చేసిన అధికార నేతలకు.. ప్రస్తుతం రూపాయి విలువ తగ్గడం.. అందులోనూ ఏకంగా పదిహేనేళ్ల కనిష్టస్థాయికి దిగజారడంతో తాము ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియకుండా పోతుంది. దేశ ఆర్థికాభివృద్ధికి కరెన్సీ మారకం విలువ అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రూపాయి విలువ క్షీణించిన నేపథ్యంతో పలు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన విషయం కూడా తెలిసిందే.. డాలరు మారకం విలువ 70 రూపాయలు దాటడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. బ్రిటిష్ పాలన నుంచి 1947లో భారత్ విముక్తి పొందేటప్పటికి రూపాయి విలువ డాలరుతో సమానంగా ఉండేది. అంటే ఒక రూపాయికి ఒక డాలరు అన్న మాట… పాలకుల అస్తవ్యస్త విధానాల వల్లే డాలరు విలువ పెరుగుతుందంటున్నారు కొంతమంది ఆర్ధిక నిపుణులు.
గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎగుమతులను పెంచేందుకు రూపాయి మారకం విలువను రూ.4.75నుంచి రూ.7.5లకు అంటే 57.89 శాతం తగ్గించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం విదేశ మారక నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రూపాయి మారకం విలువను బాగా తగ్గించింది.గత 15 ఏళ్ల నుంచి రూపాయి విలువ పడిపోతూనే ఉంది. 2004-05లో డాలరు మారకం విలువ 44.95 రూపాయలు ఉంది.
2005-06లో 44.28, 2006-07లో 45.25, 2007-2008లో 40.28, 2008-09లో 46.46, 2009-10లో 47.74, 2010-11లో 45.90, 2011-12లో 48.53, 2012-13లో 54.44, 2013-14లో 60.42, 2014-15లో 61.17, 2015-16లో 65.49, 2016-17లో 67.15, 2017-18లో 64.54, 2018-19లో 70.11 ఉంది. పదేళ్ల యూపీఏ హయాంలో రూపాయి పతనం రూ.44.28నుంచి రూ.60.42కు చేరితే, ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో అది రూ.60.42నుంచి 70రూపాయలకు దిగజారింది.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more