Neta app reveals picture of bjp in elections held now ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపికి నష్టమే..

Bjp may lose 70 seats if lok sabha elections held now neta app

Neta app, Lok Sabha Elections 2019, election outcomes, Pratham Mittal, Samajwadi Party-Bahujan Samaj Party alliance, EVMs, Ashok Gehlot, assembly constituencies, Madhya Pradesh, Rajasthan, BJP, Congress, Politics

The developers of the Neta app claim that the Bharatiya Janata Party (BJP) is poised to lose as many as 70-seats if Lok Sabha elections were to be held now,

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపికి నష్టమే..

Posted: 08/25/2018 04:00 PM IST
Bjp may lose 70 seats if lok sabha elections held now neta app

లోక్‌సభ ఎన్నికలను ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ 70కి పైగా సీట్లను కోల్పోతుందని పోలింగ్‌ ఏజెన్సీ సంస్థ నేతా యాప్‌ అంచనా వేస్తోంది. ఈ యాప్‌ ప్రజా ప్రతినిధులపై ప్రజలకున్న అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత వాటిని సమీక్షించి నివేదికలు రూపొందిస్తుంటుంది. తాజాగా లోక్‌సభ ఎన్నికలపై కొన్ని అంచనాలను వెల్లడించింది. గత మూడు నెలలుగా ప్రజల్లో బీజేపికున్న విశ్వాసం సన్నగిల్లినట్లు కన్పిస్తోందని నేతా యాప్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ పట్టు సాధిస్తోందని తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పుడే నిర్వహిస్తే భాజపా 70కి పైగా సీట్లు కోల్పోయే అవకాశముందని చెబుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపి 282 సీట్లు సాధించగా.. ఇప్పుడు ఎన్నికలొస్తే ఆ సంఖ్య 212కు తగ్గుందని అంచనా వేస్తోంది. ఇక కాంగ్రెస్‌ సంఖ్యా బలం 44 నుంచి 110కి పెరుగుతుందని నేతా యాప్‌ పేర్కొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీనే ముందంజలో నిలుస్తుందని అభిప్రాయపడింది.

నేతా యాప్‌ సీఈవో రాబిన్‌ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ధఫా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ అధికారాన్ని అందుకునే అవకాశాలు వున్నాయిని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే కంటే ఎక్కువగా కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. పాపులర్‌ లీడర్‌ రేటింగ్లో గెహ్లాట్‌ కు 42.3శాతం ఓట్లు రాగా.. రాజేకు 33.3శాతమే వచ్చాయన్నారు. ఇక మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్ కు 42.6శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాకు 48.9శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  Neta app  Lok Sabha Elections 2019  Pratham Mittal  Madhya Pradesh  Rajasthan  Politics  

Other Articles