Paytm to make investing in mutual funds cheaper ఖాతాదారులకు ఉచితంగా మ్యూచువల్ ఫండ్ సేవలు

Paytm money to offer mf investment products at no fee to customers

Paytm Money to offer MF investment, Paytm Money, Paytm Money Whole time Director Pravin Jadhav, Paytm Money, Paytm, digital Money, MF investment, Paytm Money, Pravin Jadhav, Mutual Funds, business, companies

Paytm Money, a subsidiary of digital payments major Paytm, today said it will offer mutual fund investment products at zero fee to its customers.

ఖాతాదారులకు ఉచితంగా మ్యూచువల్ ఫండ్ సేవలు

Posted: 08/25/2018 03:05 PM IST
Paytm money to offer mf investment products at no fee to customers

సంపద సృష్టి కోసం యవత ఈ మధ్యకాలంలో అధికంగా మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంచుకుంటున్నారు. అయితే యువతను అకర్షించి తమ వైపు మళ్లించుకుని తమ ద్వారా వారిని పలు రకాల స్కీముల్లో చేర్పించేందుకు కూడా అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అనేక సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ ను ప్రవేశపెడుతూ, సేవల రూపంలో కస్టమర్లపై వీర బాదుడు బాదుతున్నాయి. దీనిని అరికడుతూ తాము కేవలం నామమాత్రపు రుసుముతోనే సేవలను అందిస్తామని, అవసరమైతే ఉచిత సేవలను కూడా అందిస్తామని ముందుకు వచ్చింది మరో సంస్థ.

అదే డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం. తమ ఖాతాదారులకు మ్యూచువల్‌ ఫండ్‌ సేవలను ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. తమ సబ్సిడరీ  ‘పేటీఎం మనీ’ ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన డైరెక్ట్‌ ప్లాన్స్‌కు చెందిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను మరో రెండు వారాల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ‘పెట్టుబడులు పెట్టే విధానాన్ని సరళీకృతం చేసి పారదర్శకంగా సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా క్ష్యం’ అని పేటీఎం మనీ పూర్తికాల సంచాలకుడు ప్రవీణ్‌ జాదవ్‌ తెలిపారు.

'మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో ప్రస్తుతం 2 కోట్ల మంది మదుపరులున్నారు. రానున్న ఐదేళ్లలో మరో మూడు కోట్ల మంది కొత్త పెట్టుబడిదారులు వస్తారు. ఈ స్థితిలో మంచి సేవలు అందుబాటులోకి తెస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నది మా అంచనా’ అని ఆయన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. పెట్టుబడులు, సంపద సృష్టి కోసం ఓ వేదిక రూపొందిస్తున్నామని, తమ ప్రయత్నం పట్ల ఇప్పటికే 7.7 లక్షల మంది ఖాతాదారులు  ఆసక్తి చూపి పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paytm  digital Money  MF investment  Paytm Money  Pravin Jadhav  Mutual Funds  business  

Other Articles