YSR congress Leader to join Janasena జనసేనలోకి వైసీపి నేత పితాని బాలకృష్ణ..

Pawan kalyan jana sena to gear up for the elections from sep 12th

pawan kalyan, janasena, east godavari, ysr congress, pithani balakrishna, political affairs commitee, election campaign, andhra pradesh, politics

Actor turned politician pawan kalyan orders JanaSena political affairs commitee to carry out election campaign from September 12 through out the state till completion of eletions, and also suggests party should go to grassroot level,

ఎన్నికలకు ప్రణాళికబద్దంగా జనసేన సమాయత్తం

Posted: 08/23/2018 06:23 PM IST
Pawan kalyan jana sena to gear up for the elections from sep 12th

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వామపక్ష పార్టీలతో కలసి ఈ సారి ఎన్నికలలో ప్రత్యక్షపోరులోకి దిగనుంది. ఈ మేరకు ఇప్పటికే పక్కా ప్రణాళికను అనుసరించి ముందుకు సాగుతున్న జనసేన.. రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీలతో పోటాపోటీగా వెళ్లాలన్న కార్యచరణను కూడా సిద్దం చేసింది. ఇప్పటికే 12 అంశాలతో కూడిన జనసేన విజన్ డాక్యుమెంట్ ప్రజల మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలో విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్)ను జనసేనాని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

సెప్టెంబర్ 12 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. ఈ ప్రచారాన్ని ఎన్నికలు పూర్తైయ్యేంత వరకు కొనసాగించాలని మార్గనిర్దేశం చేశారు. ప్రచారం కోసం ఉపయోగించుకోవాల్సిన మాధ్యమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గ్రామ స్థాయి వరకు కేడర్ ను సర్వ సన్నద్ధం చేయాలని శ్రేణులకు సూచించారు. బూత్ స్థాయి కమిటీల నుంచి అన్ని కమిటీలు క్రీయాశీలకంగా వ్యవహరించి ఎన్నికలకు సిద్దంగా వుండాలని అదేశించారు.

త్వరలో జనసేనలోకి వైసీపీ నేత పితాని

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ మరింత బలోపేతంగా మారుతుంది. వైసీపికి చెందిన నేత ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్టు  ప్రకటించారు. తనకు ఇంకా ఎనిమిదేళ్ల ప్రభుత్వ సర్వీస్ ఉన్నా, టికెట్ ఇస్తానని జగన్ చెప్పటంతో పార్టీలో చేరానని ఆయన చెప్పారు. అయితే, అర్థాంతరంగా తనను కోఆర్డినేటర్ పదవి నుండి తప్పించటం మనస్తాపానికి గురి చేసిందని చెప్పారు.

పవన్‌ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జనసేనలో చేరతానని బాలకృష్ణ చెప్పారు. జనసేన సిద్ధాంతాలపట్ల ఆకర్షితుడనై పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదన్నారు. జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచన’ను తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ అన్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles