Congress shares pictures of Rahul Gandhi అసమానతలతో ఉగ్రవాదం పుట్టుకొస్లుంది: రాహుల్ గాంధీ

Rahul gandhi ays exclusion from development process could lead to insurgency

BJP,Congress,Hamburg,Rahul Gandhi,Rahul Gandhi in Germany,Rahul Gandhi in UK, UK, politics

The Congress on Thursday posted pictures on social media of its president Rahul Gandhi, who is currently in Germany as part of his four-day visit to Europe.

అసమానతలతో ఉగ్రవాదం పుట్టుకొస్లుంది: రాహుల్ గాంధీ

Posted: 08/23/2018 08:23 PM IST
Rahul gandhi ays exclusion from development process could lead to insurgency

ప్రధాని నరేంద్ర మోదీ తన పట్ల ద్వేషపూరితంగా మాట్లాడారని అందుకే తాను ఆలింగనం చేసుకున్నానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వెల్లడించారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన రాహుల్‌ హాంబర్గ్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీకి ఇచ్చిన ఆలింగనం గురించి మాట్లాడారు. గత నెలలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడిన అనంతరం మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకుని అందరినీ ఆశ్చర్యపర్చారు.

అయితే మోదీకి తన ప్రవర్తన నచ్చలేదని, కాంగ్రెస్‌ పార్టీలో కొందరు సీనియర్‌ నేతలకు కూడా తాను మోదీని హగ్‌ చేసుకోవడం నచ్చలేదని రాహుల్‌ వెల్లడించారు. పలువురు నేతలు తర్వాత తన దగ్గరికి వచ్చి అలా హగ్‌ చేసుకోవద్దని చెప్పారని తెలిపారు. ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమని గాంధీ చెప్పారని, అందుకే ఆయన ద్వేషపూరితంగా మాట్లాడినందుకు తాను ఆలింగనం చేసుకున్నానని రాహుల్‌ వివరణ ఇచ్చారు.

అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలని, కొన్ని వర్గాల ప్రజలను పట్టించుకోకపోతే అంతర్గత ఉగ్రవాదం పుట్టుకోచ్చేందుకు అది దోహదపడుతుందని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. 21వ శతాబ్దంలో ప్రజలకు మీరు ఓ విజన్‌ ఇవ్వకపోతే మరెవరో వారికి విజన్‌ ఇస్తారని, అది పెద్ద ప్రమాదంగా మారుతుందని పేర్కొన్నారు. గిరిజనులు, దళితులు, మైనార్టీలను ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వామ్యం చేయట్లేదని ఆయన ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  Hamburg  Rahul Gandhi  Rahul Gandhi in Germany  Rahul Gandhi in UK  UK  politics  

Other Articles