Kerala floods: MEA smoothly rejects foreign donations మీ సాయం మాకొద్దు: విదేశాలతో భారత్

Kerala floods mea smoothly rejects foreign donations

India monsoon, southwest monsoon, Kerala flood, foreign donations, UPA, NDA, uae volentary doantion, Mohammed bin Rashid Al Maktoum, Pinarayi Vijayan, Raveesh Kumar, Ministry of External Affairs, karnataka rains, bay of bengal

The Ministry of External Affairs has clarified that India won't be able to accept such funds from a foreign government due to a policy put in place by the former UPA government following the 2004 tsunami.

మీ సాయం మాకొద్దు: విదేశాలతో భారత్

Posted: 08/23/2018 05:35 PM IST
Kerala floods mea smoothly rejects foreign donations

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి  అంతర్జాతీయంగా పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కేరళకు 700 కోట్ల ఆర్ధికసాయాన్ని ఆఫర్ చేసింది యూఏఈ ప్రభుత్వం. మాల్దీవులు, థాయ్ లాండ్ లు కూడా కేరళకు ఆర్ధికసాయం ప్రకటించాయి. అయితే ఈ సాయాన్ని సున్నితంగా తిరస్కరించింది భారత ప్రభుత్వం.  భారత్ పై వారు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది విపత్తుల సమయంలో విదేశీ ప్రభుత్వాల సాయం అవసరం లేదని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతమున్న విధానాల ప్రకారం…విపత్తుల సమయంలో విదేశీ సాయాన్ని అంగీకరచబోమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. కేరళను పునరుద్దరణకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే కేరళా ప్రళయాన్ని విపరీతంగా పేర్కోన్న కేంద్రం.. త్వరలోనే అన్నివిధాలా అదుకునేందుకు చర్యలు తీసుకుంటుందుని చెప్పారు. భారత్ దేశంలో హిందూ మహాసముద్రంలో ప్రళయం సంభవించి సునామీగా వచ్చి బీభత్సం సృష్టించిన 2004 నుంచి భారత ప్రభుత్వం విదేశీయుల నుంచి విరాళాలు తీసుకోవడం లేదు.

ఇది భారతదేశ ప్రతిష్టను భంగం కలిగించేదిగా తయారవుతుందని, అయినా ప్రకృతి ప్రళయాలు సంభవించిన నేపథ్యంలో భారత్ తనంతట తానుగా కోలుకునే స్థాయి వుందన్న సందేశాన్ని పంపాలని కూడా భావిస్తుందని దీంతో విదేశీ విరాళాలు స్వీకరించేందుకు విముఖతను వ్యక్తం చేస్తుందని సమాచారం. దీనితో పాటుగా భారత్ లో అర్థిక సంస్కరణలు వేగం పుంజుకుంటూ దేశం కూడా ఆర్థకంగా పురోగమిస్తున్న క్రమంలో విరాళం పోందడం కన్నా దానం చేసేలా వుంటేనే తమకు సముచితమని భారత్ భావిస్తుందని భావన వ్యక్తం అవుతుందని అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఆ తరువాత 2014లో విదేశాల నుంచి విరాళాలు పోంతే విషయంలో కొంత సవరణలు చేశారు. దేశంలో ప్రకృతిప్రళయాలు సంభవించినప్పుడు విదేశీయులు అందించే విరాళాలను స్వీకరించవచ్చని ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సవరణ చేసిన అనంతరం కూడా విదేశీ విరాళాన్ని తీసుకోకపోవడంలో అంతర్యమేమిటన్న ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయంలో మరో అడుగు ముందుకేసీ.. గల్స్ దేశాల సాయాన్ని తాము పోందేందుకు కేంద్రం అనుమతిని ఇవ్వాలని కోరారు.

గల్స్ దేశాలు అన్ని రంగాలలో పురోగమించడానికి, అభివృద్దిలో భారతీయులు మరీ ముఖ్యంగా తమ దేశానికి వలసవచ్చిన కేరళావాసులు ఇతోధికంగా సేవలు అందించారని.. ఇవాళ వాళ్ల నేల తల్లి కన్నీరు పెడుతుండటాన్ని చూడలేక తాము విరాళాన్ని అందించామని అదేశ ఉపాధ్యక్షుడు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో గల్స్ దేశాల సాయాన్ని తాము పోందేందుకు అనుమతించాలని కూడా కేంద్రాన్ని కోరారు. అయినా కేంద్రం మాత్రం గల్స్ దేశంతో పాటు మాల్దీవులు, థాయ్ ల్యాండ్, ఖతార్ దేశాల విరాళాలను సున్నితంగా తిరస్కరించింది. అయితే పీఎం సహాయ నిధికి, కేరళ సీఎం సహాయ నిధికి ఎన్నారైలు, ఇంటర్నేషనల్ ఫౌండేషన్లు, ఆర్గనైజేషన్లు సహాయం చేయొచ్చని తెలిపారు.

ఇక మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు కూడా కేంద్రం తీరును తప్పు పట్టారు. విదేశీ సహాయాన్ని స్వాగతించడంలో తప్పేముంది? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. వా‌జ్‌పేయి హయాంలో విదేశీ సహాయానికి సంబంధించి నిబంధనలను సవరించారు. ఆ తర్వాత మన్మోహన్ హయాంలో దేశంలోని విదేశీ ఆర్గనైజేషన్స్ సహాయాన్ని కూడా నిరాకరిస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చారని అయితే.. అత్యవసర రెస్క్యూ ఆపరేషన్స్ కోసం గత యూపీఏ ప్రభుత్వం కూడా విదేశీ సాయాన్ని స్వీకరించలేదని చెప్పారు. కానీ విపత్తు నష్ట నివారణ చర్యల కోసం మాత్రం అప్పటి ప్రభుత్వం విదేశీ సహాయాన్ని స్వీకరించిందన్న విషయాన్ని స్పష్టం చేశారు.

విదేశీ సహాయాన్ని స్వీకరించడానికి ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఎలాంటి అడ్డంకులు లేవని సంజయ్ బారు అన్నారు. కేరళకు ఇప్పుడు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అవసరమని,ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ సహాయాన్ని స్వీకరిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.అంతకుముందు సంజయ్ బారు చేసిన ఓ ట్వీట్‌లో కేరళ-గల్ఫ్ సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు.రెండింటి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం సహాయం తీసుకోకున్నా.. నష్ట నివారణ చర్యలకు మాత్రం విదేశీ సహాయం తీసుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala flood  foreign donations  UPA  NDA  Pinarayi Vijayan  Raveesh Kumar  MEA  

Other Articles