chiranjeevi visitation to subbarami reddy house సుబ్బారామిరెడ్డిని పరామర్శించిన మెగాస్టార్..

Chiranjeevi visitation to subbarami reddy house

chiranjeevi, subbarami reddy, knee joint surgery, syeraa narsimha reddy, pawan kalyan, trivikram srinivas, jubilee hills, tollywood

megastar chiranjeevi visits senior congress leader, rajya sabha member, tikkavarapu subbarami reddy house on his return from foreign after his knee joint surgery

సుబ్బారామిరెడ్డిని పరామర్శించిన మెగాస్టార్..

Posted: 08/22/2018 02:23 PM IST
Chiranjeevi visitation to subbarami reddy house

రాజ్యసభ సబ్యుడు, కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త డా. టి. సుబ్బారామిరెడ్డికి తెలుగు సినిమా పరిశ్రమతో మంచి అనుబంధాలు వున్న విషయం తెలుగువారికి తెలిసిందే. ఆయన కళాభిమాని అని.. ప్రతీఏటా ఆయన తన పేరిట టీఎస్ఆర్ అవార్డులను కూడా ప్రకటిస్తూ వుంటారు. సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రత్యేకంగా సన్మానిస్తూ అవార్డులు అందజేస్తుంటారు. అలాంటి కళాపిసాసి ఇటీవల విదేశాలలో మోకాలు శస్త్ర చికిత్స చేసుకున్నారు.

చికిత్స తరువాత నగరానికి తిరిగివచ్చిన సుబ్బారామిరెడ్డిని ఇవాళ తన జన్మదినం రోజున మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. నగరంలోని సుబ్బారామిరెడ్డి నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనను పరామర్శించి.. ప్రస్తుతం ఆయన మోకాళ్ల నోప్పులు ఎలా వున్నాయన్న విషయమై ఆయననే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సుబ్బారామిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బారామిరెడ్డి అభిలషించారు. అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి శ్రీ సురేఖ గారికి, చిత్ర నిర్మాత రామ్ చరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. కాగా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా చేయాలనేది సుబ్బిరామి రెడ్డి ఆలోచన. దానికి దర్శకుడిగా త్రివిక్రమ్ వ్యవహరిస్తాడనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సంగతి ఓ కొలిక్కి రాలేదు. మరి సుబ్బిరామిరెడ్డి కోరికను మెగాబ్రదర్స్ తీరుస్తారేమో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles