india to go with Czech portable petrol pump technology దేశంలో త్వరలో పోర్టబుల్ పెట్రోల్ పంపులు..

Czech portable petrol pump technology introduced in india

Czech portable petrol pump technology introduced in India, portable petrol pump technology, Czech portable petrol pump technology, Alinz Portable Petrol Pump Pvt Ltd, APPPPL, PETROCard Czech

Self-service portable petrol pumps with over-ground storage tanks emulating Czech technology, have been introduced in the country. The pumps are being marketed by Alinz Portable Petrol Pump Pvt Ltd.

దేశంలో త్వరలో పోర్టబుల్ పెట్రోల్ పంపులు..

Posted: 08/22/2018 07:51 PM IST
Czech portable petrol pump technology introduced in india

దేశంలో త్వరలోనే పోర్టబుల్ పెట్రోల్ పంపులు అందుబాటులోకి రానున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఏ దేశ సాంకేతిక సహాయాన్ని పోంది మన దేశం బిహెచ్ఇఎల్ లాంటి భారీ పరిశ్రమలను నెలకొల్పిందో అదే దేశం చెక్ రిపబ్లిక్ లోని సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో తాజాగా పోర్టబుల్ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పచ్చజెండాను ఊపింది. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఇంధనం సమకూర్చే ఫిల్లింగ్ స్టేషన్ లలో పోర్టబుల్ డిజైన్ తో అలింజ్ గ్రూప్ సంస్థ ముందుకువచ్చింది.

కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు ఫలించి.. ప్రభుత్వ అనుమతి పొంది పోర్టబుల్ పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమైంది. అత్యాధునిక పద్దతులతో ఎంపిక చేసుకున్న స్థలంలో కేవలం రెండు గంటల్లోనే ఈ పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేస్తారు. 10 వేల లీటర్ల సామర్థ్యం నుంచి 35 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులతో ఈ స్టేషన్ లో ఇన్ స్టాల్ చేస్తారు. 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ట్యాంక్ సామర్థ్యాన్ని బట్టి స్థలం అవసరం అవుతుంది.

పెట్రోల్, డీజిల్ లను ట్యాంకులో ఉన్న పార్టిషియన్ లో నింపుకోవడానికి వీలుగా ఉంటుంది. సీసీ కెమెరాలు, డిజిటల్ చెల్లింపులకు అనుకూలంగా ఈ పోర్టబుల్ పెట్రోల్ పంపులను డిజైన్ చేశారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో సంప్రదింపులు జరిపామని, దేశమంతటా ఇలాంటి పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అలింజ్ సంస్థ ఎండీ ఇంద్రజిత్ తెలిపారు. త్వరలోనే ఎల్పీజీ సంబంధించిన పోర్టబుల్ పంపులను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles