M. Karunanidhi, 94: the end of an era అవిశ్రాంత ప్రజాభ్యుదయనేతకు ఇక సెలవు..

Muthuvel karunanidhi laid to rest at marina between mentor and arch rival

M Karunanidhi, Karunanidhi, Merina beach, Rajaji Hall, Last Journey, Palanisamy, AIADMK, TN Government, DMK, Madras High Court, AIADMK, PM Modi, Nirmala Sitharaman, Mamta benerjee, kamal hassan, Rajini kanth, KCR, Congress, Madras High Court, AIADMK, Kalaignar, dmk, stalin, Rajini kanth, Kamal hassan, pawan kalyan, YS Jagan, tamil nadu

Thousands throng streets of Chennai as Kalaignar Karunanidhi's mortal remains left to Marina Beach from Rajaji Hall. M Karunanidhi's remains are being taken in a gun carriage. He will be laid to rest near his mentor Annadurai.

అవిశ్రాంత ప్రజాభ్యుదయనేత కరుణకు ఇక సెలవు..

Posted: 08/08/2018 07:47 PM IST
Muthuvel karunanidhi laid to rest at marina between mentor and arch rival

ద్రవిడ ఉద్యమనేత, కవి, కళాకారుడు, సాహితీవేత్త, సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్రవేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్యనేత, డీఎంకే అధ్యక్షుడు ముత్తువేల్ కరుణానిధి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అభిమానుల అశ్రు నయనాల, కార్యకర్తల కన్నీళ్ల పర్యంతం కాగా.. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో అధికార లాంఛనాలతో కళైంజర్ అంత్యక్రియలు ముగిశాయి. ఏడు పదులకు పైగా రాజకీయ రంగంలో కొనసాగుతూ జాతికి సేవలందించిన కురువృద్ధ మహానేతకు గౌరవ సూచకంగా దేశరక్షణలో భాగమైన త్రివిధ దళాల సైనికులు సగర్వంగా వందనం సమర్పించి, గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు.

బతికినంతకాలం ద్రవిడ వాదమే నినాదంగా మార్చుకున్న మహానేత, హేతువాద పునాదులపై ఎదిగి.. బ్రాహ్మన అధిపత్యాన్ని ప్రశ్నించి.. ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ నేత.. లక్షలాది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ అనంతలోకాలకు తరలివెవెళ్లిపోయారు. తమిళ సాహితీ సాంస్కృతిక రంగాల్లో అసమాన సృజనశీలి, సుదీర్ఘ రాజకీయ అనుభవ ప్రతిభా సంపన్నుడు, వ్యూహప్రతివ్యూహాలను రచించే చతురతలో అపర చాణక్యుడు.. కళైంజర్‌ కరుణానిధి.. ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు చేరిపోయారు.

కరుణానిధి అస్తమయంతో దేశ రాజకీయాల్లో ఒక తరం వెళ్లిపోయింది. డీఎంకే అధినేతగా అర్ధ శతాబ్దానికి పైగా విస్తరించిన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనితర సాధ్యంగా 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, 5 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కరుణానిధి.. తన జీవితంలో ఎన్నడూ, ఏ ఎన్నికలోనూ ఓటమి అనేదే చూడకపోవడం విశేషం. కళలకూ రాజకీయాలకూ మధ్య అరుదైన అద్భుత వారధిగా నిలిచిన కరుణానిధి అస్తమయంతో ఒక శకం ముగిసినట్లైంది.

కరుణానిధికి అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. మాజీ ప్రధాని దేవగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, పలువురు ప్రముఖులు కరుణానిధి అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు డీఎం శ్రేణులు, అభిమానులు మెరీనా బీచ్ కి భారీగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత మంది మెరీనా బీచ్ దగ్గరకు వచ్చి తమ ప్రియతమ నేతకు కడసారి వీడ్కోలు పలికారు. కరుణానిధి అంత్యక్రియల సమయంలో కుటుంభసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karunanidhi  Merina beach  DMK  Rajaji Hall  Last Journey  chennai  tamil nadu  

Other Articles