SBI rakes it big with an extra Rs 2,433 cr పెనాల్టీ వసూళ్లలో ఎస్.బి.ఐ ఘనాపాటి..

Banks collect rs 5000 crore from customers as minimum balance penalty in fy18

India Business News, state bank of india, Oriental Bank of Commerce, lok sabha, Indian Institute of Technology Bombay, ICICI bank, Axis powers, AIEBA, Axis, bad loans, bank balance, GST, HDFC, ICICI Bank, Jan Dhan Yojana, minimumu balance, Narendra Modi, NPAs, SBI, SBI penalty, UPA, wilful defaulters

As many as 21 public sector banks and three major private sector lenders collected a whopping Rs. 5,000 crore from customers for non-maintenance of minimum balance in their accounts in 2017-18,

ఖాతాదారుల నుంచి రూ.వేల కోట్ల పెనాల్టీ రాబట్టిన బ్యాంకులు..

Posted: 08/06/2018 02:15 PM IST
Banks collect rs 5000 crore from customers as minimum balance penalty in fy18

ఖాతాల్లో కనీస నగదు నిల్వలులేని వినియోగదారులపై గత ఆర్థిక సంవత్సరం (2017-18) రూ.5వేల కోట్ల జరిమానాలు వేశాయి బ్యాంకులు. ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ప్రధాన బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) వసూలు చేసినవే ఇందులో సగం ఉన్నాయి. లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, మరో మూడు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిసి రికార్డు స్థాయిలో పెనాల్టీలను వసూలు చేశాయని తెలిపారు.

ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సర కాలంలో ఖాతాదారుల నుంచి కనీస నగదు నిల్వలు లేవని 4వేల 989 కోట్ల రూపాయలు జరిమానా కింద వసూలు చేశాయి. ఇందులో ఎస్బీఐ వసూళ్లే రూ.2వేల 433.87 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎస్బీఐకి రూ.6,547 కోట్ల నికర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఇదే ఆర్థిక సంవత్సరం జరిమానాల రూపంలో ఎస్బీఐకి రూ.2,434 కోట్ల ఆదాయం రావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నది. నిజానికి కనీస నగదు నిల్వలు లేని ఖాతాదారులపై జరిమానాలు తీవ్రంగా ఉన్నాయని ఎస్బీఐపై ఇప్పటికే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

ఎస్బీఐ తర్వాత రూ.590.84 కోట్లతో హెచ్.డి.ఎప్.సి బ్యాంక్ ఉన్నది. 2016-17లో రూ. 619.39 కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్ల వసూలుతో మూడు, రూ.317.6కోట్లతో ఐసిఐసిఐ నాలుగో స్థానంలో, రూ.211 కోట్లతో పంజాబ్ నేషనల్‌ బ్యాంక్ ఐదో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టం రూ.85వేల 361 కోట్లుగా ఉంది. ఏదిఏమైనా వ్యాపారం, దానిపై లాభాల సంగతెలాఉన్నా.. కనీస నగదు నిల్వలు లేని ఖాతాదారులపై జరిమానాల రూపంలో చేస్తున్న వసూళ్లు బ్యాంకులకు భలే ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIEBA  Axis  SBI  ICICI  banks  Oriental Bank of Commerce  Minimum balance  Narendra Modi  Lok Sabha  

Other Articles