Case filed on Ex-MLA Gandra Venkata Ramana Reddy కాంగ్రెస్ నేతపై లైంగిక వేధింపుల కేసు..

Case filed on ex mla gandra after sexual harassment allegations

Gandra Venkata Ramana Reddy, Congress, Vijaya Lakshmi Reddy, sexual harassment, mother foundation, protest, political conspiracy, political opponents, Telangana, politics

Case filed on Ex-MLA and Congress party senior leader Gandra Venkata Ramana Reddy after a woman alleged him about sexual harassment and protested in front of his apartment.

కాంగ్రెస్ నేతపై లైంగిక వేధింపుల కేసు..

Posted: 08/06/2018 02:12 PM IST
Case filed on ex mla gandra after sexual harassment allegations

కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను నాలుగేళ్లు శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలేశారని ఓ మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు గండ్రపై కేసు నమోదైంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే గండ్రపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం పోలీసులు పలు సెక్షన్ల కింద సీనియర్ నేతపై కేసు నమోదు చేశారు. మదర్ ఫౌండేషన్‌ ప్రతినిధి కొమురెల్లి విజయలక్ష్మి గండ్రపై సంచలన అరోపణలు చేస్తూ.. పదేళ్ల పరిచయంలో నాలుగేళ్ల పాటు తనతో సంసారం చేసి, ఇప్పుడు మొహం చాటేస్తున్నారన్నారు. అంతేకాదు నిలదీసినందుకు తనపై పోలీసుల కేసులు కూడా పెట్టించారని అరెస్టు చేయించారని అరోపించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పస్రాకు చెందిన తనకు గండ్ర వెంకటరమణారెడ్డితో పదేళ్ల క్రితం పరిచయమైందని.. అయితే చనువు పెరిగి పెరిగి శారీరక సంబంధానికి దారితీసినట్టు ఆమె ఆరోపించారు. అయన పంక్షన్ హాల్ తో పాటు నివాసంలోనూ అనేక పర్యాయాలు కలిశామని తెలిపారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పేర్కొంది. తాను ఎవరో తెలియనట్టు ప్రవరిస్తూ, తప్పుడు ప్రచారం చేసి తన జీవితం నాశనం చేశాడని ఆమె ఆరోపణలు గుప్పించారు. దీనిపై ఆయనను కలవడానికి ఆగస్టు 3 న జీఎంఆర్ అపార్టుమెంట్ కూడా వెళ్లానని చెప్పారు.

అయితే పోలీసులకు సమాచారమిచ్చి తనను అరెస్ట్ చేయించారని విజయలక్ష్మీ అవేదన వ్యక్తం చేశారు. తానెవరో తెలియదంటూ తన మనుషులతో దాడి చేయించి ఇంట్లో నుంచి గెంటేశాడని, సుబేదారి పోలీసుస్టేషన్లో న్యూసెన్స్ కేసు పెట్టించి అరెస్టు చేయించాడని తెలిపింది. గండ్రతో తనకున్న సంబంధాలను తన సెల్ ఫోన్లలో భద్రపర్చుకున్నానని, అయితే వాటిని అరెస్టు సమయంలో బలవంతంగా లాక్కున్నారని ఆరోపించింది. అయితే తన వద్దనున్న ఆధారాలను కూడా పోలీసుల వద్దే వున్నాయని.. తన కాల్ డేటాను బయటపెడితే నిజాలు వాటంతట అవే బయటకువస్తాయని తెలిపారు.

కాగా, విజయలక్ష్మీ తనపై చేస్తోన్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ఆమె ఆరోపణలు తనను షాక్‌కు గురిచేశాయని, రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఓ మహిళను అడ్డుపెట్టుకుని నీచమైన పనులకు దిగజారారని గండ్ర దుయ్యబట్టారు. మరోవైపు గండ్ర సతీమణి సైతం ఆయనకు బాసటగా నిలిచారు. ముప్పైమూడేళ్ల మా వైవాహిక జీవితంలో ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలుసని, ఇది కేవలం ప్రత్యర్థి పార్టీ కుట్రని ఆమె అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles