14 Maoists killed in Bastar gun battle మావోలకు ఎదురుదెబ్బ.. ఎదురుకాల్పుల్లో 14 మంది మృతి

14 maoists killed in encounter with security forces in chhattisgarh

Maoist encounter, tribal Bastar region of Chhattisgarh, maoists, security forces, Encounter, Sukma, Gollappalli, Konta, Bastar

As many as 14 Maoists were killed and 16 weapons seized during a fierce encounter with security forces near a forest village between Gollappalli and Konta in Sukma district in the tribal Bastar region of Chhattisgarh

మావోలకు ఎదురుదెబ్బ.. ఎదురుకాల్పుల్లో 14 మంది మృతి

Posted: 08/06/2018 02:17 PM IST
14 maoists killed in encounter with security forces in chhattisgarh

సుక్మా జిల్లా కుంట పోలీసు స్టేషన్ పరిధి కన్నాయి గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో మావోలకు చెందిన భారీ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. గొల్లపల్లి ప్రాంతంలో నక్సల్స్ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నక్సల్స్ కోసం ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని కుంట ఎస్పీ ప్రకటించారు.

కొద్ది రోజుల నుంచి పరిస్థితులు సాధారణంగానే కనిపించినా మళ్లీ తాజాగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కూంబింగ్ కు వెళ్లిన జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డగా.. వారిని లొంగిపోమ్మని.. జవాన్లు హెచ్చరించినా మావోయిస్టులు వారి మాటలను లక్ష్యపెట్టలేదని బధ్రతా దళాలు పేర్కోన్నాయి. అదే సమయంలో మావోలు తమపై కాల్పలు జరిపారని, దీంతో తాము కాల్పులతోనే బదులిచ్చామని.. అయితే ప్రాణ రక్షణకు తాము ఫైరింగ్ జరిపినట్లు బధ్రతా దళాలు పేర్కోన్నాయి.

ఎన్ కౌంటర్ ను ధ్రువీకరించిన స్థానిక పోలీసు అధికారులు, కొందరు జవాన్లకు కూడా గాయాలు అయ్యాయని, వారిని ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్యపై అధికారిక ప్రకటన తరువాత వెల్లడిస్తామని, ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. కాగా, ఎన్ కౌంటర్ తరువాత ఆ ప్రదేశానికి అదనపు బలగాలను తరలించిన ఉన్నతాధికారులు, అడవులను జల్లెడ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles