honest auto driver returns 5 lakh rupees డబ్బు తిరిగిచ్చి.. నిజాయితీ నిరూపించుకున్న అటోడ్రైవర్

Autorickshaw driver returns bag containing rs 5 lakh to elderly man

money bag, honesty, auto driver, elderly man, Autorickshaw driver, Prakash Karamchandani, Marketyard area, Kondhwa, Maruti Dagadu Waghmare, Kondhwa police station, Milind Gaikwad, crime

In an exemplary show of honesty, an autorickshaw driver returned a bag containing Rs 5 lakh left behind by an elederly passenger from Kondhwa.

డబ్బు తిరిగిచ్చి.. నిజాయితీ నిరూపించుకున్న అటోడ్రైవర్

Posted: 08/03/2018 04:24 PM IST
Autorickshaw driver returns bag containing rs 5 lakh to elderly man

ఎవరికైనా ఏకంగా ఐదు లక్షల రూపాయాల నగదు అనుకోకుండా దొరికితే ఏం చేస్తారు.. హమ్మయ్య కష్టాలు తీరాయిరా దేవుడా.. అంటూ చట్టుక్కున ఇంటికి తీసుకెళ్తారు. కానీ తాను పెదవాడైనా.. తనకు విద్య వంటబట్టక అటోను నడుపుతూనే జీవనాధారం పోందుతున్న ఓ అటో డ్రైవర్ మాత్రం ఇలా అలోచించలేదు. ఈ ఐదు లక్షలు పోగొట్టుకున్న వాళ్లు ఎంత బాధను అనుభవిస్తున్నారో.. వారు ఎందుకోసం ఈ డబ్బును తీసుకువస్తున్నారో.. ఈ డబ్బును వారికందకపోతే వారి కష్టం ఎలా వుంటుందోనని అలోచించాడు.

పరుల సొమ్ము పాముతో సమానమని భావించిన అటో డ్రైవర్.. అంతకుముందు తాను దిగబెట్టిన కస్టమర్ ఇంటికి వెళ్లి మరీ డబ్బును అందించాడు. ఇలా తన నీతి, నిజాయితీపరుడినని రుజువు చేసుకున్నాడు. అంతేకాదు డబ్బుతో గోప్పదనం రాదని, వ్యక్తిత్వంతో గొప్పవాడిగా మిగలడమే సముచితమని భావించాడు. అంతే ఇతడి నిజాయితీ ముందు పోలీసులు కూడా సలామ్ కొట్టేలా.. అతనికి సన్మానించేలా చేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలో కోంధ్వాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ మోతీరాం కరంచందనీ (72) అనే వ్యక్తి గురువారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో మార్కెట్‌యార్డ్ నుంచి తన ఇంటికి ఆటోలో వచ్చాడు. అయితే, తనతోపాటు తెచ్చిన రూ.5 లక్షలు నగదు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయి దిగిపోయాడు. దీన్ని డ్రైవర్ మారుతీ దగడు వాఘ్‌మేరే (60) కూడా గమనించలేదు. అక్కడ నుంచి ఆటోకు గ్యాస్ నింపడానికి ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వెనుక సీట్లో ఉన్న క్యారీబాగు అతడి కంటపడింది.

దీన్ని పరిశీలించగా అందులో రూ.5 లక్షలు ఉన్నట్టు గుర్తించాడు. దీంతో వెంటనే ప్రకాశ్ మోతీరాం ఇంటికి వెళ్లి నగదు సంచిని వారికి అప్పగించాడు. అప్పటికే ప్రకాశ్ డబ్బు సంచిని ఆటోలో మరిచిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటో డ్రైవర్ మారుతీ డబ్బులు తీసుకొచ్చిన విషయం కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఉన్న ప్రకాశ్‌కు తెలియజేశారు. నిజాయితీతో డబ్బును అప్పగించిన మారుతిని పోలీసులు అభినందించారు. పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అతడిని శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : money  honesty  auto driver  elderly man  Prakash Karamchandani  Kondhwa police station  crime  

Other Articles