teacher booked over sexual harassment కీచక టీచర్ పై పేరెంట్స్ దాడి.. పోలీసులకు అప్పగింత..

Parents thrashed teacher over sexual harassment on girl students

teacher, sexual harassment, parents, manhandle, thrashed, Chaitanya School, dd colony, hyderabad, amberpet police station, crime

parents in the vicinity of chaitanya school at dd colony of ramanthapur at hyderabad thrashed a teacher over sexual harassment with girl students and handovered him to police. police booked a case against him and sent him to hospital for treatment

కీచక టీచర్ పై పేరెంట్స్ దాడి.. పోలీసులకు అప్పగింత..

Posted: 08/03/2018 03:39 PM IST
Parents thrashed teacher over sexual harassment on girl students

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్స్ అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయి. యజమాన్యం నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారాయి. విద్యార్థులను వక్రమార్గం పట్టకుండా సద్బుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయులే వక్రమార్గం పట్టి విద్యార్థులను లైంగికంగా వేదిస్తుంటే.. ఉపాద్యాయుడి వేధింపులు భరించలేని సదరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ వద్దకు చేరుకుని సమస్యపై నిగ్గదీస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన ఉపాద్యాయుడు పారిపోతుండగా, పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆనక పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన హైదరాబాద్‌లోని డీడీ కాలనీలో ఉన్న చైతన్య స్కూల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధ్యాయుడు రమేశ్ వెకిలిచేష్టలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శుక్రవారం పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడు రమేశ్‌కు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు స్కూల్‌లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయుడిని పోలిస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులతో తల్లిదండ్రులకు వాగ్వాదానికి దిగారు.

ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేస్తామని తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పి ఉపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడు రమేశ్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయంలో పోర్న్ వీడియోలు, చిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలని చెప్పేవాడు. గతంలో ఇలాంటి వెలికిచేష్టలు చేయడంతో రమేశ్ ను మందలించి వదిలేశారని తెలుస్తోంది. అతడి వేధింపులకు తాళలేక బాలికలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడేందుకు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. వీరిని చూసిన రమేశ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు రమేశ్చ ను పట్టుకుని చితకబాదారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles