no kick on the eve of bonalu in Hyderabad బోనాలకు ‘కిక్కు’ లేదు.. ‘సుక్క’ అమ్మోద్దని అంక్షలు..

Wine shops will be closed on the eve of bonalu

celebrating Bonalu, Mahankali temple, hyderabad temples, bonalu celebrations, hyderabad police, cyberabad police, excise police, wine shops, bars, pubs, closed

In the eve of years old tradition of celebrating bonalu in hyderabad and surrounding areas, police had passed orders to close all the wine shops and bars including pubs.

బోనాలకు ‘కిక్కు’ లేదు.. ‘సుక్క’ అమ్మోద్దని ఆంక్షలు..

Posted: 08/03/2018 02:56 PM IST
Wine shops will be closed on the eve of bonalu

ఆషాడమాసం మొదలు తెలంగాణ వ్యాప్తంగా బోనాల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. వందల ఏళ్ల తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ సంబరాలను తెలంగాణవాసులు జరుపుకుంటారు. ఊరారా వున్న గ్రామదేవతలకు వర్షాకాల సమయాల్లో తమకు తమ గ్రామానికి ఎలాంటి మహమ్మారులు సోకకుండా కాపాడాలని భక్తజనం కోరుకుంటారు. ఈ క్రమంలో ఆషాడ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే అదివారం రోజున ప్రతీ గ్రామంలోనూ గ్రామదేవతలకు బోనాల ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పోతురాజులు, మేకపోటేళ్ల పలహారం బండ్లు ఇలా అనేకం బోనాల ఉత్సవాల్లో భాగం.

ఇక మరికోన్ని దేవాలయాల్లో నాల్గవ వారం.. మరికొన్ని శ్రావణమాసంలోనూ బోనాలను నిర్వహిస్తుంటారు. అయితే రానున్న అధివారం రోజున నగర వ్యాప్తంగా పలు అమ్మవారి దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బోనాలకు మద్యం దుకాణాలను అందుబాటులో ఉంచరాదని పోలీసులు అదేశాలను జారీ చేశారు. బోనాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా అది, సోమవారాల్లో ( ఆగస్టు 5, 6 తేదీల్లో) మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మద్యం దుకాణాలతో పాటు బార్లు, మద్యం విక్రయించే బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులను కూడా మూసివేయాలని పోలీసు అధికారులు అంక్షలను విధించారు, అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఉంటుందని అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్ల కార్యలయవర్గాలు వెల్లడించాయి. పోలీసుల ఆదేశాలు అతిక్రమించి మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles