సినిమాల్లో విలన్ వేషాలు వేసే వారు చాలా మంది బయట మాత్రం చాలా సున్నిత మనస్కులై వుంటారు. ఇంకా చెప్పాలంటే వారి ఔదార్యం, దానదాతృత్వాల్లో హీరోలను కూడా మించిపోతారు. కానీ దురదృష్టవశాత్తు విలన్ క్యారెక్టర్ లో నటించే వారు తము నిజజీవితంలో కూడా విలన్ వేశాలు వేయడం.. తమ సహచర నటిలనే టార్గెట్ గా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నటి అసభ్యకర వీడియోను చిత్రీకరించి, ఆపై దానిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి రూ.14 లక్షలు వసూలు చేసిన ఘటనలో శాండిల్ వుడ్ నటుడు ధర్మేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నటి సునీత పిర్యాదు మేరకు స్పందించిన బెంగళూరు పోలీసులకు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం దర్మ మాత్రం పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. గత ఏడాది మార్చి నుంచి ధర్మేంద్ర తన నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నట్టు నటి సంగీత విశ్వనాథ్ ఆరోపించింది. అతడి డిమాండ్లను నెరవేర్చకుంటే తన భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 6న ఉదయం పది గంటల సమయంలో సునీత బెంగళూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ధర్మపై బలవంతపు వసూళ్లు, బెదిరింపుల కేసు పెట్టింది.మార్చి 1, 2017న రాత్రి సునీతకు ఫోన్ చేసిన ధర్మ షూటింగ్ కోసం వెంటనే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు వెళ్లాలని సూచించాడు. అందుకోసం తన డ్రైవర్ నవీన్‌కు కారు ఇచ్చి సునీత ఇంటికి పంపాడు. అతడు ఆమెను తీసుకెళ్లి షూటింగ్ సెట్ వద్ద వదిలిపెట్టాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ధర్మ షూటింగ్ రద్దు అయినట్టు చెప్పి భోజనానికి పిలిచాడు. భోజనం చేసి కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.
మెలకువ వచ్చి చూసిన తర్వాత ఆమెకు అసభ్యకర వీడియో చూపించిన ధర్మ బ్లాక్ మెయిల్ చేశాడు. తాను అడిగిన మొత్తాన్నిఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆన్లైన్లో దానిని అప్లోడ్ చేస్తానని, ఆమె తల్లిదండ్రులకు దానిని చూపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సునీత మార్చి 2017 నుంచి మే 2018 వరకు మొత్తం రూ.14 లక్షలు చెల్లించుకుంది. ఈ ఏడాది మే 27న ధర్మతో సునీత, ఆమె భర్త వాదనకు దిగారు. తమ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ రాత్రి సునీత ఇంటికి వచ్చిన ధర్మ మరిన్ని డబ్బులు ఇవ్వకుంటే అందరినీ చంపేస్తానని బెదిరించాడని సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ధర్మతోపాటు నవీన్ అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more