హై అలర్ట్: ఉపఖండంలో పెను భూకంపాలు.. Alert: Deadliest earthquakes to shake India

Earth s mantle torn into 4 pieces under quake prone tibetan plateau

Xiaodong Song, geology professor, University of Illinois, Tibetan plateau, tectonic plates collision, geologic processes, Earthquakes

"The continental collision between the Indian and Asian tectonic plates shaped the landscape of East Asia, producing some of the deadliest earthquakes in the world and the sub-continent."

హై అలర్ట్: ఉపఖండంలో పెను భూకంపాలు..

Posted: 08/01/2018 12:45 PM IST
Earth s mantle torn into 4 pieces under quake prone tibetan plateau

ఉపఖండంగా బాసిల్లుతున్న భారతావనికి పెను భూకంపాల నుంచి ముప్పుందని పరిశోధకులు హెచ్చరించారు. కేవలం భారత ఉపఖండమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కంపించినున్నట్లు తమ తాజా అధ్యయనం తేల్చిందని చెప్పారు. టిబెట్ పీఠం కింద ఉన్న 160 కిలోమీటర్ల లోతున వున్న ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టుకోనుండటమే ఇందుకు కారణమని వారు స్పష్టం చేశారు.

ఈ మేరకు భూకంపలపై అధ్యయనం చేసిన యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ జియోలజీ ప్రొఫెసర్ జియోడాంగ్.. టెక్టానిక్ ప్లేట్లు అంత సాధారణంగా ఢీకొట్టుకోవని వెల్లడించారు. దాదాపు 5 లక్షల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగాల్లో ఇవి ఢీకొట్టుకున్నాయని తెలిపారు. అప్పుడు కూడా పెను భూకంపాలు సంభవించాయని  తెలిపారు. మరోమారు కూడా అదే విధమైన ఉత్పాతంలాంటి ప్రకంపనలు సంభవించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం ఇండియన్, ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు తూర్పు ఆసియా స్వరూపాన్ని మార్చనున్నాయని, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపాలు సంభవించే ప్రమాదముందని తన తాజా అధ్యయనంలో తెలిపారు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నాలుగు ముక్కలుగా విడిపోనుందని తమ అధ్యయనంలో తేలినట్టు చెప్పారు. పలు మార్గాల నుంచి తాము భూ భౌతిక సమాచారాన్ని సేకరించామని, టిబెట్ పీఠభూమికి 160 కిలోమీటర్ల లోతున జరుగుతున్న పరిణామాలను టోమోగ్రాఫిక్ విధానంలో చిత్రాలు తీశామని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles