Egg white turns into plastic powder ఈ కోడిగుడ్లు కల్తీవేనా.. అధికారుల పరీక్షలు..

Egg white turns into plastic powder officials conduct tests

egg white, plastic powder, chandra shekar, district hospital, survelliance officer, Dr.Anil Kumar, Dr.shashidhar, gandhinagar housing board, sangankallu, bellary, karnataka

In a shocking incident, Egg white turns into plastic powder in chandrashekar's house, at gandhinagar housing board in sangankallu of bellery in karnataka. After doubts araising he took the same to district hospital where officials including survelliance officer Dr.Anil Kumar are conduct tests.

ప్లాస్టిక్ పొడిలా మారిన కోడిగుడ్డులోని తెల్ల సొన

Posted: 08/01/2018 11:08 AM IST
Egg white turns into plastic powder officials conduct tests

రోజుకో కోడిగుడ్డు అరోగ్యానికి మేలని ఓ వైపు అధికారులు విరివిగా ప్రచారం చేస్తున్నారు. గుడ్డులో పోషకపదార్థాలు అనేకం వున్నాయని తేలడంతో.. అత్యంత చౌకైన ధరలో లభించే కోడిగుడ్డును తినడం వల్ల పోషకాలు లభిస్తాయన్నది వాస్తవం. దీంతో అప్పటి వరకు గుడ్డును నాన్ వెజ్ కోటాలోకి వేసినా.. తాజాగా దానిని ప్రత్యేక కోటాను కల్పిస్తూ ఎగేరియన్ గా నామకరణం కూడా జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో కోడిగుడ్డుల నాణ్యతను ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అధికారులపైనే వుంది.

ఎందుకంటే నకిలీలు లీలలు చూపుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇందుగలదు అందులేదన్న సందేహము లేకుండా ఎందెందు వెతికినా నకిలీలు దర్శనమిస్తున్నాయి. తాజాగా కోడిగుడ్డులో కూడా నకిలీలు వచ్చేశాయా.? అన్న సందేహం ఉత్పన్నమయ్యేలా జరిగింది ఓ ఘటన. కోడిగడ్డులో ప్లాస్టిక్‌ పొడి ప్రత్యక్షమైన ఘటన కర్ణాటకలోని బళ్లారి నగరంలో వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక పశుసంవర్థక శాఖా సదరు గుడ్డును పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. రంగంలోకి దిగిన అహార తనిఖీ అధికారులు కోడిగుడ్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి పరిశీలించారు. వాటిని ఎక్కడ నుంచి తెచ్చారు? ఎన్ని రోజులుగా నిల్వ ఉంచారు వంటి వివరాలు సేకరించారు.

ఇంత హైరానా ఎందుకయ్యిందంటే.. బళ్లారి నగరం సంగనకల్లు రహదారిలోని గాంధీనగర్‌ హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌ తన ఇంటి సమీపంలో ఉన్న ఓ దుకాణంలో కోడిగుడ్లు కొనుగోలు చేశాడు. ఓ గుడ్డును అట్టు (ఆమ్లెట్‌) వేసుకుంటున్న సమయంలో చేతి నుంచి జారి కింద పడింది. వెంటనే ఆయన నేలపై పడిన పచ్చ సొనను సేకరించి ఆమ్లెట్‌ వేసుకుని, తెల్లగా ఉన్న దానిని వదిలేశాడు. కొద్దిసేపటికి తెల్ల సొన ప్లాస్టిక్‌ పొడి మాదిరిగా తయారైంది.

దీంతో తాను తిన్న అమ్లేట్ తో అనారోగ్యం బారిన పడతానేమో అన్న సందేహం నేపథ్యంలో.. అతను తాను కొనుగోలు చేసిన కోడిగుడ్లు, ప్లాస్టిక్‌ మాదిరి తయారైన పొడిని తీసుకొని జిల్లాసుపత్రిలో ఉన్న సర్వేలెన్స్‌ అధికారి డా.అనిల్‌కుమార్‌ దృష్టికి తెచ్చారు. ఆయన సూచన మేరకు స్థానిక హెచ్‌.ఆర్‌.గవియప్ప కూడలి వద్ద ఉన్న పశువుల ఆసుపత్రికి వెళ్లి డైరెక్టర్‌ డా.శశిధర్‌కు చూపారు. వెంటనే ఆయన నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : egg white  plastic powder  chandra shekar  district hospital  bellary  karnataka  

Other Articles