Sri Reddy Accepts Lawrence Challenge లారెన్స్ రాఘవ ఛాలెంజ్ కు ‘సై’ అన్న శ్రీరెడ్డి

Raghava lawrence says he is ready to give a chance to sri reddy

Raghava Lawrence, Sri Reddy, Challenge, Chance, Tamil actor-director, varahi, casting couch, sexual abuse, harassment, facebook, twitter, social media, kollywood

Tamil actor-director Raghava Lawrence said that he pities Sri Reddy and is willing to offer her a chance in his film, if she performs both acting and dance well. This challenge is taken up by sri reddy, says she is ready in her facebook

రాఘవ లారెన్స్ ఛాలెంజ్ కు ‘సై’ అన్న శ్రీరెడ్డి

Posted: 07/30/2018 05:28 PM IST
Raghava lawrence says he is ready to give a chance to sri reddy

కాస్టింగ్ కౌచ్ అంశాన్ని ఇటు టాలీవుడ్ లో తెరపైకి తీసుకువచ్చి.. నానా హంగామా చేసిన నటి శ్రీరెడ్డి.. తన పట్ల ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా అసభ్యంగా వ్యవహరించారన్న అరోపణలు చేసిన నేపథ్యంలో అమెకు సవాల్ విసిరారు. తనకు అమెపై జాలేస్తుందని, ఈ నేపథ్యంలో అమెకు తాను సినిమాలో నటిగా అవకాశమిస్తానని.. అయితే అమె తన నటనను, డాన్స్ ముందుగా నిరూపించుకోవాలని అయన సవాల్ విసిరారు. తాజాగా ఈ ఛాలెంజ్ పై శ్రీరెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. లారెన్స్ మాస్టార్ విసిరిన సవాలుకు తాను సిద్దమేనని చెప్పింది.

గోల్కొండ హోటల్ లో నా నడుము శరీర భాగాలను చూపించమన్నాడంటూ’ సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. వీటిపై స్పందించిన లారెన్స్ ట్విట్టర్ ద్వారా సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. ఇందులో శ్రీరెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. శ్రీరెడ్డి తనను ఆఫర్స్ పేరుతో వాడుకున్నారని ఆరోపణలు చేస్తుంది. ఆమె సమస్య అదే కాబట్టి నేను ఓ బహిరంగ సవాల్ విసురుతున్నా.. నేనొక ప్రెస్ మీట్ పెడతా. అందర్నీ పిలుస్తా.. నువ్ కూడా రా.. నీకొక సీన్‌తో పాటు ఒక స్టెప్ కూడా ఇస్తా. ఆ సీన్‌ను, ఆ స్టెప్‌ను వేసి చూపించు. అలా అని నీకు కష్టమైనవి ఏమీ ఇవ్వను నటనకు కావాల్సిన బేసిక్స్ మాత్రమే ఇస్తా. చాలా సింపుల్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తా.. నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే నా ఎదుట, ప్రెస్ ఎదుట అవి చేసి చూపించు.

నేను చెప్పిన బేసిక్ యాక్షన్, స్టెప్ వేసి నువ్ బెస్ట్ యాక్టర్‌వి అని నిరూపించుకుంటే మీడియా ఎదుటే నా నెక్స్ట్ సినిమాలో నీకు మంచి ఆఫర్ ఇస్తా.. అంతే కాదు అక్కడే అడ్వాన్స్ కూడా ఇస్తా. దమ్ముంటే ఈ సవాల్‌ని స్వీకరించు. ఒకవేళ అందరి ముందు చేయలేను అనుకుంటే నా మేనేజర్ కలవండి. మీతో పాటు మీ లాయర్‌ని సన్నిహితులను తెచ్చుకోండి. నీ ప్రతిభను చూపించండి. మీకు హెల్ప్ చేయడానికి నేను సిద్ధం’ అంటూ శ్రీరెడ్డికి ఛాలెంజ్ విసిరారు లారెన్స్. ఈ ఛాలెంజ్‌కు సై అంటూ ఫేస్ బుక్ ద్వారా మెసేజ్‌ను పాస్ చేసింది శ్రీరెడ్డి. ‘నేను లారెన్స్ మాస్టర్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా.. అందరూ నన్ను ఆశీర్వదించండి’ అంటూ లారెన్స్ కు కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghava Lawrence  Sri Reddy  Challenge  Chance  varahi  casting couch  kollywood  

Other Articles