Crackdown on Hyderabad theatres over MRP మల్టీప్లెక్సులు, థియేటర్లలో ఇక ఎమ్మార్పీ ధరలు..

Crackdown on hyderabad theatres over mrp

Hyderabad Theatres, Selling over MRP, Raids on Theatres, Akun Sabharwal, multiplex, Consumer Act, Legal Metrology Department, Maharashtra, Telangana

If anyone is caught selling at a price above MRP, violating the Weights and Measures Act, they would have to shell out Rs 25,000 to Rs 1 lakh as fine, said Akun Sabharwal.

మల్టీప్లెక్సులు, థియేటర్లలో ఇక ఎమ్మార్పీ ధరలు..

Posted: 07/30/2018 04:22 PM IST
Crackdown on hyderabad theatres over mrp

హైదరాబాద్ లోని మల్టీప్లెక్సులు, ధియేటర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లలో ఇకపై తినుబండారాలు, కూల్ డ్రింక్స్ సహా స్నాక్స్ అన్నింటినీ ఎమ్మార్పీ ధరలపైనే విక్రయించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ అదేశాలను తప్పితే భారీ జరిమానాలు తప్పవని లీగల్ మెట్రాలజీ విభాగం కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన అదేశాలు ఆగస్టు 1 (మంగళవారం) నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇకపై అన్ని ధియేటర్లలో శీతల పానీయాలు, స్నాక్స్, వాటర్ బాటిల్స్ సహా అన్ని తినుబండారాలను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని హెచ్చరించారు.

ఈ విషయంలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ)కు అదనంగా వసూలు చేసినట్టు తెలిస్తే, భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని అన్నారు. నీళ్ల బాటిల్స్ అమ్మేవారు, వివిధ రకాల బ్రాండ్ లను తప్పనిసరిగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచి, వారికి నచ్చిన బాటిల్ కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్యాకేజ్డ్ ప్రొడక్టు ఏదైనా ఎంఆర్పీపై మాత్రమే అమ్మాలని తెలిపారు. సినిమా హాల్స్, మల్టీప్లెక్స్ లలో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సమీక్ష జరిపిన ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇక మల్టీప్లెక్స్ లలో అమ్మే ప్యాకింగ్ లేని ఫుడ్... అంటే పాప్ కార్న్, శీతల పానీయాలు తదితరాలను అందించే కంటెయినర్లపై ఎంత బరువు? ధర ఎంత? తదితర విషయాలు తప్పనిసరిగా ముద్రించాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు. తమ అధికారులు ప్రత్యేక రైడ్ లు చేస్తూ, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. సింగిల్ రేట్ పాలసీని అమలు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన తొలిసారి రూ. 25 వేలు, రెండో సారి రూ. 50 వేలు, మూడోసారి రూ. 1 లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష పడుతుందని అకున్ సబర్వాల్ హెచ్చరించారు.

ఇదిలావుండగా, బాంబే హైకోర్టు అదేశం నేపథ్యంలో అటు మహారాష్ట్ర సహా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని మల్టీప్లెక్సులు, సినిమా ధీయేటర్లలో కూడా మంగళవారం నుంచి ఈ అంక్షలు అమల్లోకి రానున్నాయి. ఓ వైపు ఈ ధరలపై అక్కడి ప్రజా సంఘాలతో పాటు మహారాష్ట్ర నవనిర్మాణ సమితీ కూడా అధిక ధరలపై యుద్దాన్ని ప్రకటించి.. దీనిపై న్యాయపోరాటం చేసింది. దీంతో దీనిపై ధాఖలైన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఆగస్టు ఒకటి నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా ధియేటర్లు, మల్టీప్లెక్సుల్లో అన్ని తినుబండారాలను గరిష్ట చిల్లర ధరకు మాత్రమే విక్రయించాలని అదేశాలను ఇవ్వడంతో.. అక్కడ కూడా రేపటి నుంచే ఈ నిబంధనలు అమ్లలోకి రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Theatres  MRP  Theatres  Akun Sabharwal  multiplex  Consumer Act  Maharashtra  Telangana  

Other Articles