minister ganta srinivasa rao house gheored మంత్రి గంటా ఇంటి ఎదుట అందోళన, ఉద్రిక్తత..

Minister ganta srinivasa rao house gheored

ganta srinivas rao, AP minister for education, mid day meal workers, women organisations, vishakapatnam, Andhra Pradesh

The mid day meal women workers had gheored minister for education ganta srinivas rao house demanding not to give mid day meal contract to private organisations.

మంత్రి ఇంటి ముందు బోజన కార్మికుల ‘గంట’ మోగింది..

Posted: 07/30/2018 06:20 PM IST
Minister ganta srinivasa rao house gheored

తమకు ఎంతోకొంత అసరాగా వున్న మధ్యహ్నా బోజన పథకాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి.. కార్పోరేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. మధ్యాహ్న బోజన మహిళా కార్మికులు ఇవాళ విశాఖపట్నంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట బైఠాయించారు. అక్కడికి కొంత దూరం నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు మంత్రి ఇంటి వద్దకు చేరుకోగానే పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. తమతో పాటు తెచ్చుకున్న గిన్నెలపై కర్రలతో కొడుతూ తమ నిరసనను తెలియజేశారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో హైవేను దిగ్బంధించడానికి కార్మికులు యత్నించడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలు నిర్వహిస్తున్న పలువురు మహిళ కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

అంతకుముందు పలువురు మధ్యాహ్న బోజన కార్మికులు మాట్లాడుతూ.. ఏళ్లుగా తాము విద్యార్థులకు వేడివేడిగా బోజనాలను వండివర్చుతున్నామని, అయితే ఇప్పుడు అకస్మాత్తుగా తమ పొట్టకొడుతూ ప్రభుత్వం.. ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు దానిని అప్పగించాలని నిర్ణయానికి రావడం సముచితం కాదని వారు అవేదన, అందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆరు మాసాలకు పైగా కనీస వేతనాలు కూడా చెల్లించని ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు మధ్యాహ్న బోజనాన్ని అప్పగించడం సమంజసమేలా అవుతుందని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles