SBI shocks staff of former associate banks భారతీయ స్టేట్ బ్యాంకు మళ్లీ షాకిచ్చింది.. ఈ సారి

Return overtime compensation sbi to staff of former associate banks

associate banks, State Bank of India, demonetisation overtime work, note ban, overtime compensation, extra hours, compensation for extra work, erstwhile associate banks, sbi instruction, sbi staff, state banks

In an internal circular to its zonal offices, SBI has said the associate banks should have settled the compensation before the merger and the parent SBI is not liable to pay up the overtime money to the former employees of associate banks.

భారతీయ స్టేట్ బ్యాంకు మళ్లీ షాకిచ్చింది.. ఈ సారి

Posted: 07/17/2018 01:17 PM IST
Return overtime compensation sbi to staff of former associate banks

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ఇటీవల తనలో విలీనం చేసుకున్న అనుబంధ బ్యాంకుల్లోని ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా ఆ బ్యాంక్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని పరిశీలిస్తే ఇదే విషయం తేట‌తెల్ల‌మవుతోంది. నోట్లరద్దు సమయంలో అదనపు పనిగంటలు పనిచేసిన ఉద్యోగులకు అందించిన పరిహారాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాలంటూ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఎస్బీఐ తాజాగా షాక్‌ ఇచ్చింది.

ఏప్రిల్‌ 1, 2017న ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అదనపు పని గంటలు పని చేసిన ఉద్యోగులకు పరిహారం అందిస్తామని గతంలో ఎస్బీఐ హామీ ఇచ్చింది. ఈ మేరకు చెల్లింపులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఎస్బీఐ కొత్త ట్విస్ట్‌ పెట్టింది. నోట్ల రద్దు సమయానికి ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగలేదు కావున.. ఆయా బ్యాంకుల్లోని సిబ్బందికి తాము పరిహారం చెల్లించేది లేదని పేర్కొంటూ కొత్త వివాదానికి తెర తీసింది.

నోట్ల రద్దు సమయంలో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ పటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్ లకు చెందిన 70,000 మంది అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి అదనపు గంటలు పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా కృషి చేశారు. ఓవర్ టైమ్‌ (అదనపు పనిగంటలు) చేసినందుకు ఎస్బీఐ హామీ ఇచ్చిన మేర పరిహారం చెల్లించింది. అయితే వీరు అదనంగా పనిచేసినందుకు అందుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఎస్బీఐ కోరుతుండటంతో అనుబంధ బ్యాంకుల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓవర్ టైమ్‌ చేసినందుకు ఇచ్చిన పరిహారం కేవలం తమ ఎస్బీఐ ఉద్యోగులకేనని, అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఇది వర్తించదని జోనల్‌ హెడ్ క్వార్టర్లకు ఎస్బీఐ పంపిన సమాచారంతో ఆయా బ్యాంకుల సిబ్బంది మండిపడుతున్నారు. గతంలో తమ అనుబంధ బ్యాంకుల సిబ్బందికి చెల్లించిన పరిహారంను తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్బీఐ తన జోనల్‌ మేనేజర్లను కోరడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిహారం రికవరీ ఉత్తర్వులపై ఇటు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా తప్పుబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Southwest monsoon had reached kerala on monday says imd

  తొలకరి త్వరలో పలకరింపు.. కేరళను తాకిన రుతుపవనాలు

  Jun 02 | దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం కొంత ఆలస్యం కానుందని చేసిన అంచనాలను తోసిరాజుతూ సరిగ్గా సమయంలోనే రుతుపవనాలు వచ్చేశాయి. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనుండగా.. ఈ... Read more

 • Covid 19 update six deaths 94 fresh corona cases in telangana

  కరోనా విజృంభన: తెలంగాణలో 24 గంటల్లో 94 అత్యధిక కేసులు..

  Jun 02 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళన కలిగిస్తున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు ప్రతీ రోజు రాష్ట్రంలో... Read more

 • Lpg cylinder prices hiked after 3 consecutive cuts

  ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయహో.!

  Jun 01 | కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో వంట‌గ్యాస్ ఉప‌యోగిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. తాజాగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెరిగింది. మహమ్మారి కారణంగా మార్చి నెల నుంచి... Read more

 • Glass alcohol bottle surgically removed from mans anal cavity

  తాగుబోతు వేషాలు: మందుబాటిల్ ను అక్కడ దాచిపెట్టాడు..

  Jun 01 | పీకల వరకు మద్యం సేవించిన ఓ మందుబాబు చేసిన వ్యవహారంతో తన కెరీర్ లో మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త కేసును వైద్యులు చూసి షాక్ అయ్యారు. తన తాగుబోతు వేశాలతో..  ఔరా.. అని... Read more

 • 10 digit mobile numbers to continue no shift to 11 digits trai

  11 అంకెల ఫోన్ నెంబర్.. క్లారిటీ ఇచ్చిన ట్రాయ్..

  Jun 01 | దేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన 4జీ సర్వీసులు కూడా అధునీకరించబడుతున్న రోజలివి. ఇక త్వరలోనే 4జీ టెక్నాలజీ పోయి 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే సోషల్ స్టేటస్ సింబల్... Read more

Today on Telugu Wishesh