money lender demands high interest from daughter కృష్ణా జిల్లా కూతురు వద్దనుంచే వడ్డీ వసూలు చేసిన కసాయి

Another call money case in krishna money lender demands high interest from daughter

vijayawada, call money case, machlipatnam, gampalagudem, teacher, father, daughter, kilaru hanumantha rao, chandra lekha, collector, laxmikantam, money lender, money lender, krishna district collector, crime

another call money case shocks localites as barrower hospitalised suffering cardiac arrest, after lender demanding 500 times interest and principle amount.

ITEMVIDEOS: నా కూతురైనా వడ్డీ కట్టాల్సిందే: ‘‘కాల్ మనీ’’ విషనాగు..

Posted: 07/17/2018 02:45 PM IST
Another call money case in krishna money lender demands high interest from daughter

అంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తాజాగా మరో కాల్ మనీ రక్కసి బుసలుకొట్టి.. వృద్ద దంపతులపై దాడికి పాల్పడి జులం ప్రదర్శించి.. మనోవేదనతో అసుపత్రిలో జీనర్మరణాల మధ్య కొట్టుమిట్టాడేట్లు చేసిన ఘటనను మర్చిపోకముందే అదే కృష్ణ జిల్లాలో మరో కాల్ మనీ ఘనుడి ఉదంతం వెలుగుచూసింది. ధనం మూలమ్ ఇదం జగత్ అనే ఎంతటి ఘణాపాటీలైనా.. డబ్బును అర్జించేది పిల్లల కోసమే. తమ చేతుల్లోనే రేపటి పౌరులు తీర్చిదిద్దబడుతున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలతో పాటు క్రమశిక్షణ, సద్బుద్దులు నేర్పిస్తారు. కానీ ఈ ఘనుడు మాత్రం పూర్తి భిన్నం.

సద్బుద్దులు నేర్పించడం మాట పక్కనబెడితే.. తన కన్న కూతురి వద్దే వడ్డీలకు వడ్డీలు వసూలు చేస్తూ.. ఇప్పటికే అందుకుగాను మూడింతలు వసూలు చేసినా.. ఇంకా అసులు అలాగే వుందని మరీ కూతురి సంసారంలో నిప్పులు పోస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచలీపట్టణంలోని గంపలగూడెం మండలం తునికిపాడు మండల పరిషత్‌ పాఠశాలలో కిలారు హనుమంతరావు టీచర్ గా పనిచేస్తున్నారు. గతంలో హనుమంతరావు తన కుమార్తె చంద్రలేఖకు ఐదు లక్షలు అప్పుగా ఇచ్చాడు.

ఒక్కో నెల డబ్బును చెల్లించడం అలస్యం కావడంతో.. ఐదు లక్షల రూపాయలకు చక్రవడ్డీలు.. వడ్డీలపై మళ్లీ వడ్డీలు వేసి మొత్తం 15 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఇదంతా కేవలం వడ్డీ మాత్రమేనని.. అసలు ఇంకా అలాగే వుందని మరో 5 లక్షలు చెల్లించమని డిమాండ్ చేసాడు. దీనికి చంద్రలేఖ నిరాకరించడంతో ఆమెకు చెందిన నాలుగున్న ఎకరాలలో పంట పండించుకోకుండా అడ్డుపడ్డాడు. దీంతో చంద్రలేఖ కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : machlipatnam  teacher  kilaru hanumantha rao  chandra lekha  collector  call money case  money lender  crime  

Other Articles