150 people duped of Rs. 1 cr. కరక్కాయ మోసం: రూ. కొట్లు కొట్టేసిన ఘనుడిపై కేసు

Manager booked for fraud of rs 1 crore

Soft Integrate Multi Foods Pvt Ltd, MIG, KPHB Colony. cheating, Mallikarjuna, myrobalan, kukatpally cheating case, karakkaya business, Kukatpally, KPHB, Fraud, crore, Baswaraj, cyberabad police, hyderabad, crime

KPHB police registered a cheating case against the manager of a private firm for duping people for over Rs 1 crore in the name of providing profit for powdering ink nuts.

కరక్కాయ మోసం: రూ. కొట్లు కొట్టేసిన ఘనుడిపై కేసు

Posted: 07/17/2018 11:36 AM IST
Manager booked for fraud of rs 1 crore

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా, దగా అన్న మహాకవి శ్రీరంగం శ్రీనివాసులు ఎప్పుడో హెచ్చరించినా పెడచెవిన పెట్టి.. అరచేతిలో వైకుంఠం చూసే ఘరానా మోసగాళ్ల వలలో చిక్కుకుని తాము మోసపోయామని తెలుసుకున్నాక.. లబోదిబోమని మొత్తుకోవడం బాధితులకు అలవాటైపోతుంది. తాజాగా కూకట్ పల్లిలో కూడా ఇలాంటి కేటుగాడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. కరక్కాయల పొడి పేరుతో జనం గొంతులో పచ్చి వెలక్కాయ పెట్టాడు. అందుకోసం ఏకంగా ఓ సంస్థనే ప్రారంభించాడు. బుట్టలో పడ్డవారందరికీ కోట్లాది రూపాయల కుచ్చు టోపీ పెట్టి మాయమయ్యాడు.

తామంతా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేటుగాడి నయవంచన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ కే.పీ.హెచ్.బీ కాలనీలో ఇటీవల సాఫ్ట్ ఇంటిగ్రేట్‌ మల్టీటూల్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో ఓ సంస్థ వెలిసింది. పేరు వినడానికి సాఫ్ట్ వేర్ కంపెనీలా ఉన్నా.. వ్యాపారం చేసింది మాత్రం కరక్కాయలతో అంటే విచిత్రంగా వుంది కదూ. తమ వద్ద కరక్కాయలు తీసుకెళ్లి పొడి చేసి ఇస్తే కిలోకు రూ. 300 ఇస్తామని చెప్పారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చాలా మంది మహిళలు ఆకర్షితులయ్యారు.

అయితే.. అసలు తిరకాసు ఇక్కడే వుంది. కరక్కాలు తమ వద్దే తీసుకోవాలని.. పోడి చేసి తీసుకువచ్చేప్పుడు కూడా బిల్లు తీసుకురావాలని ఓ బిల్లు వారికిచ్చింది. కిలో కరక్కాయలను రూ.1000కి విక్రయింది. పొడి చేసి తీసుకొచ్చిన తర్వాత తాము రూ. 1300 చెల్లిస్తామని చెప్పింది. కరక్కాయల పొడిని ఆయుర్వేద ఔషధాల్లో వాడతారని, తీసుకెళ్లిన కరక్కాయలను తిరిగి ఇవ్వకపోతే నష్టపోతామనే రూ. 1000 డిపాజిట్ పెట్టామని నిర్వాహకులు చెప్పడంతో అందరూ తేలిగ్గా బుట్టలో పడ్డారు. కొన్ని రోజుల పాటు సరిగ్గానే చెల్లించడంతో చూస్తుండగానే ఈ వ్యాపారం ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది. దీంతో కరక్కాయలు తీసుకెళ్లడానికి జనం ఎగబడ్డారు.

తొలినాళ్లలో తీసుకెళ్లిన వాళ్లకు డబ్బులు రావడంతో కొందరు అప్పులు చేసి మంచి తరుణం మించిన దొరకదన్నట్లు ఏకంగా నలభై నుంచి యాభై కేజీలను కూడా తీసుకెళ్లారు. ఇలా వ్యాపారం మంచి జోరందుకున్న క్రమంలో పెద్ద ఎత్తున్న కరక్కాయల విక్రమం జరిగిన నేపథ్యంలో కంపెనీ ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది. కంపెనీకి చెందిన వ్యక్తులు అంతా అదృశ్యమయ్యారు. అంతే తాము మోసపోయామని అప్పుడు కానీ తెలుసుకోని బాధితులు  తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheating  Mallikarjuna  Kukatpally  KPHB  Fraud  crore  Baswaraj  cyberabad police  

Other Articles