pawan kalyan relaxed a while at thatipudi resorviour తాటిపూడి రిజర్వాయర్ వద్ద సేద తీరిన పవన్ కల్యాణ్

Pawan kalyan says he will takeup and talk to kcr in uttarandhra 23 castes issue

pawan kalyan one chance, pawan kalyan true benefits to people, janasena betterment of people, pawan kalyan, CM candidate, janasena, rama krishna, uttarandhra porata yatra, chandrababu naidu, capital region, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan visited thatipudi resorviour project after a meeting at Shrungavarapu Kota of Vizianagaram, where he conducted a Public Meeting as a part of uttarandhra porata yatra.

ఆ 23 కులాల సమస్యపై నేనే కేసీఆర్ తో మాట్లాడతా: పవన్

Posted: 07/03/2018 11:14 AM IST
Pawan kalyan says he will takeup and talk to kcr in uttarandhra 23 castes issue

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేవి గుడి జంక్షన్ లో నిర్వహించిన సభలో ఆయన తెలంగాణలో స్థిరపడిన ఉత్తరాంధ్రవాసుల సమస్యపై తానే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో మాట్లాడుతానని పవన్ కల్యాన్ అన్నారు. ఉత్తరాంధ్రలోని 23 వెనకబడిన కులాలను కేసీఆర్ ప్రభుత్వం ఓసీల్లో చేర్చిందని, దీనివల్ల హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాంధ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఉత్తరాంధ్రుల సమస్యను టీడీపీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ఇకపై ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు పవన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్నదే తన దృక్పధం అని అంతేకాని.. రాజకీయాలను కూడా కుహానా వ్యాపారంగా మార్చడం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారి ప్రభుత్వం ఇవ్వాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఐదేళ్లు అవకాశమిస్తే.. మళ్లీ మళ్లీ కావాలి, మీరే రావాలి అనేలా పనిచేస్తామని చెప్పారు.

 అనంతరం ఆయన రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి అక్కడి అందాలను తన స్మార్ట్‌ఫోన్‌లో బంధించారు. తాటిపూడి రిజర్వాయర్ నీటి కోసం విజయనగరం జిల్లా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. రిజర్వాయర్ చేరుకున్న పవన్ అక్కడే ఒక కొబ్బరిబోండాం తీసుకుని దానిని తాగుతూ, అక్కడున్న ప్రకృతి అందాలను తన స్మార్ట్ ఫోనులో బంధించి.. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. పవన్‌ కల్యాణ్‌ను కలవడానికి స్థానికులు ఉత్సాహం చూపారు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles