Priyanka Chopra gets notice for illegal construction ప్రియాంక చోప్రాకు అధికారుల షాక్..!

Priyanka chopra served notice by bmc for illegal construction at her oshiwara office premises

Priyanka Chopra, BMC, Mumbai, illegal constructions, Oshiwara, demolition, Bollywood, movies, entertainment

Priyanka Chopra has been sent a notice by the BMC for unauthorised construction in the premises of her Oshiwara office and the adjoining commercial premise rented out by the Bollywood actress.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు అధికారుల షాక్..!

Posted: 07/03/2018 11:47 AM IST
Priyanka chopra served notice by bmc for illegal construction at her oshiwara office premises

ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ.. గత నాలుగు పర్యాయాలుగా యువకుల మనస్సులో తిష్టవేసిన శృంగార తార అవార్డను సొంత చేసుకుని ఈ మధ్యే ప్రేమలో పడిన నటి ప్రియాంక చోప్రాకు అధికారులు షాకిచ్చారు. సినీనటిగా, సెలబ్రిటీగా గుర్తింపు వున్నా.. వాటన్నింటినీ పక్కనబెట్టిన బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అమెకు నోటీసులు జారీ చేసింది. అంథేరీ దక్షిణ ప్రాంతంలో ఈ నటికి ఒషివారా అనే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది.

అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తాజాగా మున్సిపల్ అధికారులు తేల్చారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 2013లో మున్సిపల్‌ అధికారులు ఓ ప్లాన్‌కి అంగీకారం తెలిపారు. ఇంతవరకు బాగానే వున్నా.. వాస్తు కోసం.. అక్రమంగా కొన్ని నిర్మాణాపు పనులు చేపట్టడంతో అక్కడే తేడా కొట్టింది. అక్రమంగా నిర్మాణాలు జరిపినట్లు తాజా తనిఖీల్లో గుర్తించిన అధికారులు గుర్తించారు. దీంతో అమెకు నోటీసులు జారీ చేశారు.

ఒషివారాలో అక్రమ నిర్మాణాలు చేశారని.. ఇటీవల మున్సిపల్ అధికారులకి ఐదుగురు ఫిర్యాదు చేశారు. తాజాగా అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ప్లాన్‌ ప్రకారం కాకుండా.. నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో వెంటనే ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందిగా ప్రియాంక చోప్రాకి రెండు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ నోటీసులకి స్పందించకుంటే.. తామే వాటిని కూల్చివేస్తామని అందులో మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  BMC  Mumbai  illegal constructions  Oshiwara  demolition  Bollywood  movies  entertainment  

Other Articles