FIR against actor's wife, son for rape, cheating నటుడి భార్య, కొడుకుపై చీటింగ్, అత్యాచారం కేసు

Fir against mithun chakraborty s wife son for rape cheating

Mahaakshay Chakraborty, Mithun Chakraborty, Yogeeta Bali, cheating, rape, abortion, sexual assault on women, threatening, FIR, Rohini court, delhi court, crime

A Rohini court has ordered that FIRs be filed against Mithun Chakraborty's son Mahaakshay Chakraborty and Mithun's wife Yogita Bali on charges of rape, cheating and wrongful termination of pregnancy.

బాలీవుడ్ నటుడి భార్య, కొడుకుపై చీటింగ్, అత్యాచారం కేసు

Posted: 07/03/2018 10:50 AM IST
Fir against mithun chakraborty s wife son for rape cheating

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్, ఆయన భార్య యోగితా బాలిపై చీటింగ్, అత్యాచారం కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తనపై  పెళ్లి పేరుతో మోసం చేయడంతో పాటు పలుమార్లు మహాక్షయ్ అత్యాచారానికి పాల్పడ్డాడని అరోపించిన యువతి న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో బాధిత యువతి పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మహాక్షయ్ సహా అతడి తల్లిపై ఛీటింగ్, అత్యాచార కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీలోని రోహిణి కోర్టు పోలీసులను ఆదేశించింది.

తనను మోసం చేసిన మహాక్షయ్ తనపై అత్యాచారం చేశాడని, ఈ క్రమంలో గర్బం దాల్చిన తనకు అబార్షన్ చేయించాడని ఆ తరువాత తప్పించుకు తిరుగుతున్నాడని దీంతోనే తాను న్యాయస్థానాన్ని అశ్రయించి న్యాయం కోసం అడుగుతున్నానని చెప్పారు. బాధిత యువతి కోర్టుకు సమర్పించిన పిటిషన్ ప్రకారం.. మూడేళ్ల నుంచి బాధిత యువతితో మహాక్షయ్‌కు సంబంధం ఉంది. ఇద్దరూ నిత్యం ఫోన్, చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓసారి మహాక్షయ్ తన ఫ్లాట్‌కు రావాల్సిందిగా యువతిని కోరాడు. వెళ్లిన ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి పేరుతో పలుమార్లు ఆమెను బలవంతం చేశాడు.

ఈ క్రమంలో గర్భవతి అయిన యువతికి గర్భనిరోధక మందులు ఇవ్వడంతో అబార్షన్ అయింది. ఆ తరువాత ఎన్నిసార్లు పెళ్లి పేరెత్తినా.. తప్పించుకుని తిరుగతున్నాడని అరోపించారు. ఇక మహాక్షయ్ తల్లి యోగితా బాలిని ఈ కేసులోకి లాగడంపై యువతి స్పందిస్తూ.. యోగిత తనకు ఫోన్ చేసి పలుమార్లు బెదిరించారని, తన కోడలు కావాలన్న ఆశలు ఏవైనా ఉంటే తుంచేసుకోవాలని బెదిరించారని యువతి ఆరోపించింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి అత్యాచారానికి పాల్పడినందుకే కోర్టుకెక్కినట్టు యువతి పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahaakshay Chakraborty  Mithun Chakraborty  Yogeeta Bali  cheating  rape  delhi court  crime  

Other Articles

Today on Telugu Wishesh