hc shock trs mlas, relief to expelled mlas టీఆర్ఎస్ కు షాక్.. కోమటిరెడ్డి, సంపత్ లకు ఊరట..

Hc division bench upholds single judge decision in expelling mla case

shock to trs mlas, trs mlas petition, relief to congress mlas, high court division bench upholds single judge judgement, komatireddy venkat reddy, sampath kumar, high court, division bench, single judge judgement, trs, congress, telangana

High Court division bench upholds the decision of single judge and gives shock to ruling TRS mla's in expelling congress mla's from house, which gives relief for congress leaders komati reddy venkat reddy, and sampath kumar

టీఆర్ఎస్ కు షాక్.. కోమటిరెడ్డి, సంపత్ లకు ఊరట..

Posted: 06/04/2018 12:11 PM IST
Hc division bench upholds single judge decision in expelling mla case

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ కుమార్ లకు ఊరటను కల్పిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునే మరోమారు వెలువరించింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు గవర్నర్ ను టార్టెగ్ చేస్తూ హెడ్ ఫోన్ ను విసిరారని, అది కాస్తా మండలి చైర్మెన్ స్వామిగౌడ్ కు తగిలిందని, దీంతో అతని కంటిని వెనువెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో వీరి చర్యను తీవ్రంగా పరిగణించిన అసెంబ్లీ స్పీకర్ మధుసుధనాచారి వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ అదేశాలు జారీ చేశారు. కాగా, తమ సభ్యత్వాల రద్దుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకున్నదే తడవుగా హైకోర్టును అశ్రయించారు. ఇరు తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ ఘటనకు సంబంధించి అసెంబ్లీ ప్రోసీడింగ్స్ ను వీడియోలను తమకు సమర్పించాలన్న అదేశాలను అసెంబ్లీ కార్యదర్శి సాధ్యపడదని స్పష్టం చేయడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయొద్దని సింగిల్ జడ్జి తీర్పు వెలువరించింది.

కాగా, హైకోర్టు సింగిల్ జడ్జీ వెలువరించిన తీర్పును 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటీషన్ వేశారు. అసెంబ్లీలో అమర్యాదగా వ్యవహరించిన వీరిపై వేటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటీషన్ ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పిటీషన్ వేయడం కుదరదని హైకోర్టు తెలిపింది. అసెంబ్లీ సెక్రటరీ మాత్రమే పిటీషన్ వేయాలని సూచించింది.

అంతేకాదు.. వీరిద్దరిపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ఎమ్మెల్యేలలో ఏడుగురు.. పార్టీ ఫిరాయించి కేసులో అనర్హత పిటీషన్ ఎదుర్కొంటున్నారు. వారు ఎలా పిటీషన్ వేస్తారని ప్రశ్నించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ గవర్నర్ పరిధిలో ఉంటుందని, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రశ్నించింది. స్వామి గౌడ్ కంటికి గాయమైతే.. ఆ వీడియో ఫుటేజీ బయటపెట్టాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles