Indian's body located in Lake Monroe అమెరికా సరస్సులో గల్లంతైన భారతీయుడు మృతి

Indian missing after squall hits lake monroe identified

Anup Thota, Lake Monroe, Bloomington, Indiana Conservation Officers, boating, swimming, Paynetown State Recreation Area, Monroe County Dive Team, Monroe County Sheriff’s Office, Perry-Clear Creek Fire Department, India, Andhra Pradesh

Indiana Conservation Officers have located the body of Anup Thota in Lake Monroe, two days after he was reported missing. A 26-year-old went missing while boating with friends on Lake Monroe.

అమెరికాలో విషాదం: సరస్సులో గల్లంతైన భారతీయుడు మృతి

Posted: 06/04/2018 11:30 AM IST
Indian missing after squall hits lake monroe identified

అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రమాదానికి గురై అనంతలోకాలకు తరలివెళ్లిన ఘటన విషాదాన్ని నింపింది. అగ్రరాజ్యంలోని బ్లూమింగ్ టౌన్ లో నివాసముండే యువకుడు.. విహారం కాస్తా విషాదాన్ని నింపింది. పేనీటౌన్ స్టేట్ రిక్రియేషన్ ప్రాంతంలోని మాన్రో సరస్సులో శుక్రవారం తన సహచరులతో కలసి విహారానికి వెళ్లిన ఆయన సరస్సులో ఈత కొడుతూ.. బోటింగ్ చేస్తున్న క్రమంలో గల్లంతైన తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) ప్రాణాలు కోల్పోయాడు.

శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్ చేసిన అనూప్.. తర్వాత సరదాగా ఈత కొట్టాడుతూ.. అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో అతను గల్లంతయ్యాడు. అనూప్ జాడ కనిపించకపోవడంతో అతడి మిత్రులు అందోళనకు గురయ్యారు, వెంటనే 911కి ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి ఇండియానా కన్జర్వేటివ్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే అతని జాడ కనిపించకపోవడంతో అధికారులు రెండు రోజుల పాటు అనూప్ కోసం గాలించారు.

చివరకు అధికారులు సైడ్ స్కానర్ సోనార్ తో గాలింపు చేపట్టడంతో నీటిలో 15 అడుగుల లోతున అనూప్ మృతదేహాన్ని గురించి బయటకు తీశారు. దీంతో అదివారం అతని కోసం సాగించిన అన్వేషణ విషాదంగా ముగిసింది. అనూప్ కోసం 48 గంటలకు పైగా సెర్చింగ్ ఆపరేషన్ సాగింది. సరస్సు ఒడ్డున అనూప్ కోసం ఎదురు చూసిన అతడి మిత్రులు అతడు ఇక లేడనే వార్త లేడని తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈత కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా అనూప్ కనిపించకుండా పోవడాన్ని వారు జీర్ణుంచుకోలేకపోతున్నారు. అనూప్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన గో ఫండ్ మీ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అతని మిత్రులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anup Thota  Lake Monroe  Bloomington  Paynetown  India  Andhra Pradesh  

Other Articles