man washed away in Chunchanakatte falls కాపాడబోయేలోపే కావేరిలో గల్లంతైన సైంటిస్ట్..

Cftri scientist washed away in karnataka s chunchanakatte falls

weekend picnic, Chunchanakatte falls, CFTRI scientist, washed away, wife pramila, wife Prathima, hydel power unit, siren, warning signal, tourists, KR Nagar police, karnataka

A weekend picinc to Chunchanakatte falls turned tragic as a CFTRI scientist was washed away in the gushing water. The deceased is Haryana-based Somashekar (40).

ITEMVIDEOS: కాపాడబోయేలోపే కావేరిలో గల్లంతైన సైంటిస్ట్.. అరణ్యరోదన..

Posted: 06/04/2018 12:58 PM IST
Cftri scientist washed away in karnataka s chunchanakatte falls

వారంతపు సెలవుల్లో సరదా తన కుటుంబసభ్యులు, మిత్రులతో కలసి వాటర్ ఫాల్స్ కు వెళ్లిన ఓ శాస్త్రవేత్త.. తన భార్య పిల్లల కళ్ల ఎదుటే కానరానీ లోకాలకు తరలివెళ్లడం విషాదాన్ని నింపింది. హర్యానాకు చెందిన సోమశేఖర్ అనే శాస్త్రవేత్త.. వారంతంలో తన కుటుంభంతో పాటు పలువురు స్నేహితులతో కలసి కర్ణాటకలోని మైసూరు జిల్లా చుంచనకట్టె జలపాతానికి వచ్చారు. అక్కడికి వారు చేరుకున్న సమయంలో నదిలో నీళ్లు లేకపోవడంతో నది ప్రవహించే ప్రాంతంలో రాళ్లపైకి తన భార్యా పిల్లలతో కలసి వెళ్లారు.

అయితే అకస్మాత్తుగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన సోమశేఖర్ తన భార్య ప్రతిమతో పాటు ఒక బిడ్డను గట్టుకు చేర్చాడు. ఇంతలో నీటి ప్రవాహం పెరగసాగింది. దీంతో నీళ్లలోనే ఒక చిన్నారితో పాటు ఆయన కూడా నీటిలోనే చిక్కకుపోయారు. అయితే వారిని చూసిన పలువరు స్థానికులు వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ముందుగా చిన్నారిని రక్షించిన వాళ్లు.. అనంతరం పోమశేఖర్ ను రక్షించేందుకు తాడును విసిరారు. అయితే దానిని అందుకున్న అయన దానిని నడుముకు కట్టుకునే లోపు కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

కాగా, కేకేనగర్ హైడల్ పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిని ముగించే క్రమంలో ప్రమాద సూచకంగా ఓ సైరన్ ను మ్రోగించి.. నదిలోని వారు బయటకు రావాలని హెచ్చరికలు చేసింది. అనంతరం నీటిని వదిలింది. అయితే హైడల్ యూనిట్ మ్రోగించిన సైరన్ తమకు వినిపించలేదని అక్కడ వున్న మిగతా టూరిస్టులు కూడా చెబుతున్నారు. యూనిట్ ప్రాంతంలో అలారమ్ మ్రోగించడం ద్వారా లాభం వుండదని, నదీ ప్రాంతంలోని టూరిస్టులకు వినిపించేలా అలారమ్ ఏర్పాటు చేయాలని పలువరు టూరిస్టులు కొరుతున్నారు.

#Warning: the visuals may be disturbing for some; viewer discretion advised.

A scientist from #Bengaluru, who was working in CFTRI in #Mysuru was washed away in the gushing waters of the #Cauvery river at #Chinchanakatte water falls on Sunday. pic.twitter.com/qHOGj57zVr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chunchanakatte falls  CFTRI scientist  washed away  hydel power unit  siren  cauveri  karnataka  

Other Articles