'What does the PM want': Arvind Kejriwal on CBI raids ప్రధాని మోడీకి ఏం కావాలంటూ సీఎం ఫైర్

Cbi raids delhi minister residence kejriwal asks what does pm modi want

CBI, Satyendra Jain, Delhi Minister, Satyendra Jain residence, Satyendra Jain raid, CBI raid, PWD, creative team, PWD creative team, Aam Aadmi Party, Arvind Kejriwal, new delhi, politics

The CBI today carried out searches at the residence of Delhi minister Satyendra Jain in connection with the hiring of consultants in PWD.

సీబిఐ దాడులు.. ప్రధాని మోడీకి ఏం కావాలంటూ సీఎం ఫైర్

Posted: 05/30/2018 12:22 PM IST
Cbi raids delhi minister residence kejriwal asks what does pm modi want

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిలో తాము అవినీతిపరులమని ముద్రవేసేందుకే ప్రధాని తన చూట్టు వల వేస్తూ.. తన క్యాబినెట్ మంత్రులపై సీబిఐ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా అవినీతి కేసులో ఢిల్లీ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంపై సీబిఐ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘అసలు ప్రధాని మోదీకి ఏం కావాలి..?’ అంటూ ప్రశ్నించారు.

అవినీతికి దూరంగా వుండే తమపై ప్రధాని ఎందుకు గురిపెట్టారని ప్రశ్నించారు. నిజంగా ప్రధాని అంత సచ్చీలుడైతే.. ముందుగా ఆయన పార్టీలో వున్న అవినీతి పరులను అరెస్టు చేయించాలని.. వారి ఇళ్లపై సీబిఐదాడులు నిర్వహించేలా అదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి అరోపణలు ఎదుర్కొన్న అమిత్ షా తనయుడు జైషా కొమ్ముకాసిన ప్రధాని.. అనేక మంది బీజేపి అవినీతి ప్రజాప్రతినిధులకు ఎలా బాస్ గా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా అవినీతి వ్యతిరేకించే ప్రధాని.. అనేక చోట్ల అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఎలా తీసుకున్నారని నిలదీశారు. చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మాత్రం.. అన్న చందంగా ప్రధాని ప్రజలకు నీతి చెబుతూనే తమ అవినీతి ప్రజాప్రతినిధులను మాత్రం పెంచిపోషిస్తున్నారని ఆ పార్టీ నేత అశోక్ ఉపాధ్యయ మండిపడ్డారు.

ఇక ఇదివరకే సీబిఐ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ పై నమోదు చేసిన ఓ కేసును క్రితం రోజునే క్లోజ్ చేసిన సీబిఐ.. తాజాగా నిరాధార దాడులకు పూనుకోవడమేంటని ఆ పార్టీ నేత అతిషీ మార్లీనా ప్రశ్నించారు. అసలు కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా.? లేక కార్పోరేట్ అసుపత్రుల కోసం పనిచేస్తుందా..? అని నిలదీశారు. ఢిల్లీ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్.. దేశ రాజధానిలో ప్రైస్ క్యాపింగ్ విధానాన్ని అమలు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో సీబిఐ దాడులు జరగడం.. ఈ తరహా అనుమానాలు తావిస్తుందని అమె అందోళన వ్యక్తం చేశారు. మంత్రివర్యులు ధరలపై పట్టిక పెట్టాలని, ఢిల్లీలోని ప్రైవేటు అస్పత్రులను క్రమబద్దీకరించాలని ప్రకటించగానే సీబిఐ దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. దీని వెనుకనున్న వారు ఎవరో దేశ ప్రజలందరూ గమనిస్తూనే వున్నారని అమె అన్నారు.

అసలు ఏం జరిగింది.? సీబిఐ దాడుల వెనుక కారణమేంటీ అంటే..? ఢిల్లీలోని మొహల్లా క్లినిక్స్‌, ఇతర పీడబ్ల్యూడీ ప్రాజెక్టుల కోసం 24 మందితో ఓ సృజనాత్మక బృందాన్ని ఆ శాఖ అధ్వర్యంలో నియామకాలు జరిగాయి. పీడబ్ల్యూడీ శాఖకు సత్యంద్రజైన్ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ నియామకాలు పారదర్శకంగా జరగలేదని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఉదయం ఆ శాఖా మంత్రి జైన్ నివాసం సహా ఇతర పీడబ్ల్యూడీ అధికారుల ఇళ్లల్లోనూ సీబిఐ సోదాలు చేపట్టారు. అనంతరం సత్యేంద్రజైన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా మంత్రి కూడా తన నివాసంపై సీబిఐ దాడులను నిర్థారిస్తూ.. తమ ప్రభుత్వం మేధావులను నియమించి.. జనంలోకి వెళ్లడాన్ని కేంద్రం జీర్ణించుకోలేక వారి భయాందోళనకు గురిచేసేలా సీబిఐ బృందాలను పంపిందని ట్వీట్ చేశారు.

ఇప్పటికే మనీ లాండరింగ్ వ్యవహరంలోనూ జైన్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా.. సీబీఐ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వమే చేయిస్తోందంటూ పరోక్షంగా విమర్శించారు. ‘ప్రధాని మోదీకి ఏం కావాలి..?’ అంటూ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. అటు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా సోదాలను ఖండించారు. తమ ప్రభుత్వం పేరును చెడగొట్టేందుకే ఇలాంటి దాడులు చేయిస్తున్నారన్నారు. ఇదంతా కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకే అని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles