10 lakh bankers on 2-day strike from today బ్యాంకు ఉధ్యోగుల సమ్మెబాట.. ఏటీయం సేవలపై ప్రభావం..

2 day country wide protest begins atm services may be hit

bank srike, bank strike news 2018, bank strike today, bank strike tomorrow, bank strike may 2018, bank strike in india, bank strike latest news, bank strike 2018, bank strike news, bank news, bank on strike, bank strike in india, bank holiday, which bank strike, private bank strike

Employees of public sector banks have called two-day nationwide strike starting from Wednesday morning. Banking service, ATM transactions may be hit due to this strike

బ్యాంకు ఉధ్యోగుల సమ్మెబాట.. ఏటీయం సేవలపై ప్రభావం..

Posted: 05/30/2018 11:34 AM IST
2 day country wide protest begins atm services may be hit

వేతన సవరణ డిమాండ్ తో దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఇవాళ ఉదయం తమ బ్యాంకుల వద్దకు చేరుకున్న ఉద్యోగులు.. బ్యాంకుల ఎదుటే సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు సాగే ఈ సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో దాదాపు 10 లక్షల మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో బ్యాంకు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రెండు రోజులు ఆన్లైన్ లావాదేవీలు మినహా.. ఏటీఎంలు కూడా పనిచేయవని.. ప్రజలు తమను అర్థం చేసుకోవాలని ఉద్యోగసంఘాలు కోరుతున్నాయి.

అయితే అన్ లైన్ సేవలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి. సమ్మె నేపథ్యంలో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లకు మాత్రమే కష్టాలు వుంటాయని, ఆయా వర్గాలు తెలిపాయి. పాత ప్రైవేటు బ్యాంకులతో పాటు విదేశీ బ్యాంకులు కూడా తమ సమ్మెలో పాల్గోంటున్నాయని బ్యాంకింగ్ వర్కర్స్ నేషనల్ అర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు అశ్వినీ రాణా తెలిపారు. కాగా ఈ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకు కస్టమర్లకు మాత్రం పెద్ద ఊరట లభించింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా సహా పలు ప్రైవేటు బ్యాంకుల్లో సేవలు యధాతథంగా కొనసాగుతున్నాయి.

నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి అప్పడప్పుడు మాత్రం ఏటీయంలు కరుణించగా, ఇక పూర్తి సమయం మాత్రం కస్టమర్లకు చక్కలు చూపాయి ఏటీయం కేంద్రాలు. ఇప్పటికే నోట్ల రద్దు నాటి పరిస్థితులను తలపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్న క్రమంలో బ్యాంకు సిబ్బంది సమ్మెలకు పూనుకోవడంపై మరిన్ని కష్టాలు తప్పేటట్లు లేవుని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణపై చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ, రేపు సమ్మెకు దిగక తప్పలేదని బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) తెలియజేసింది. అయితే జూన్ 1 నుండి బ్యాంకులు పనిచేయనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles