India, Pak agree to stop ceasefire breach కుక్కతోక బుద్ది పాకిస్థాన్ నిర్ణయానికి కట్టుబడేనా..?

India pak thaw both agree to follow ceasefire on loc in letter and spirit

india pakistan ceasefire, indian army, ceasefire violation, india, pakistan, loc, jammu and kashmir, rajnath singh ceasefire, kashmir, ramzan ceasefire, new delhi

A significant step forward in the thawing of relations between India and Pakistan, the DGMOs of the two armies spoke on the hotline and “agreed to fully implement the Ceasefire Understanding of 2003 in letter and spirit forthwith” on the Line of Control.

కుక్కతోక బుద్ది పాకిస్థాన్ నిర్ణయానికి కట్టుబడేనా..?

Posted: 05/30/2018 01:16 PM IST
India pak thaw both agree to follow ceasefire on loc in letter and spirit

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాయాది పాకిస్థాన్ అనేక పర్యాయాలు భారత సరిహద్దులో యథేచ్ఛగా కాల్పులకు పాల్పడుతూ.. ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే వుంది. సరిహద్దు వెంబడి ప్రతీ రోజూ కాల్పులకు దిగుతూ పౌరులు, సైనికుల ప్రాణాలను బలిగొంటోంది. భారత భూభాగంలోకి తాము పెంచిపోషించిన ఉగ్రవాదుల్ని అక్రమంగా పంపుతూనే వుంది. పాకిస్థాన్ కాల్పులను అనునిత్యం ధీటుగా ఎదుర్కోంటున్న భారత జవాన్లు., అప్పడప్పుడు మాత్రం వాటి దొంగదెబ్బకు బలవుతూనే వున్నారు. అనేక మంది స్థానిక పౌరులు కూడా ఈ కాల్పులలో అసువులు బాస్తున్నారు. ఇంకానేక మంది గాయాలపాలవుతూనే వున్నారు. సరిహద్దు ప్రాంతాలవారు తమ ఇళ్లను కూడా వదిలి ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో రంజాన్ మాసం సందర్భంగా సరిహద్దు కాల్పుల విరమణ చేయాలని ఇప్పటికే కేంద్రం అదేశించిన క్రమంలో పాకిస్థాన్ నుంచి కూడా సానుకూలత లభించింది. మంగళవారం ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరళ్లు (డీజీఎంవో) హాట్ లైన్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 2003లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై ఈ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిజాయతీగా చర్యలు తీసుకోవాలని,

సరిహద్దులోని ప్రజలకు ఎటువంటి అపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. నియంత్రణ రేఖ, వర్కింగ్ బౌండరీ వెంబడి పరిస్థితులపై సమీక్షించారు. సమస్యలు వస్తే స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగులు ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కరించుకోవాలని, అలాగే హాట్ లైన్ ద్వారా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల డీజీఎంవోల మధ్య హాట్ లైన్ ద్వారా జరిగిన చర్చల విషయాన్ని భారత సైన్యం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇదిలావుండగా, రంజాన్ తరువాత కుక్కతోక బుద్దితో వ్యవహరించే పాకిస్థాన్ ఈ నిర్ణయానికి కట్టబుడి వుంటుందా..? లేక గతంలో మాదిరిగానే మాట తప్పుతుందా.? అన్నది కాలమే తేల్చాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  pakistan  ceasefire  line of control  indian army  jammu and kashmir  new delhi  

Other Articles