prakash raj appeals to congress-jds government వారం గడిచింది.. ఇక పాలనపై దృష్టి పెట్టండీ: ప్రకాష్ రాజ్

Prakash raj appeals to congress jds government

prakash raj, supreme court, kimaraswamy, Siddaramaiah, portfolios, Congress, JD(S), karnataka, supreme court, K.G bopaiah, Vajubhai Vala, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, pro tem speaker, mukhul rothagni, kapil sibal, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, Siddaramaiah, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, PM Modi, Amit shah, karnataka, politics

SouthIndian actor prakash raj has appealed to the karnataka government to start governing the state.. congress and jds alliance had formed and are on sharing the portfolios.. he appealed in his twitter account as it had been a week.

వారం గడిచింది.. ఇక పాలనపై దృష్టి పెట్టండీ: ప్రకాష్ రాజ్

Posted: 05/30/2018 10:48 AM IST
Prakash raj appeals to congress jds government

తన సోదరి గౌరీలంకేశ్ దారుణ హత్యపై ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలని.. అప్పటి నుంచి జస్ట్ అస్కింగ్ పేరుతో బీజేపి సహా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ, కర్ణాటక బీజేపి నేతలు యడ్యూరప్పలపై తన ట్వీట్లతో విరుచుకుపడి. వారికి మోజారిటీని అందని ద్రాక్షాగా చేయడంలో తన వంతు పాత్రను పోషించిన సినీనటుడు ప్రకాష్ రాజ్.. ఇక కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని సూచనలు చేశారు. కన్నడిగులు కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరుతుందా? అంటూ వేచి చూస్తున్నారని ఆయన తాజాగా ట్వీట్ చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారం రోజులైందని, ఇక పాలనపై దృష్టి సారించాలని కోరారు. రోజులు గడుస్తున్నా ఇంకా పాలనపై దృష్టి సారించకపోవడంపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తిగా వున్నారన్న విషయాన్ని గ్రహించాలని ఆయన అన్నారు. మంత్రి పదవులను త్వరగా ఖరారు చేసి కేబినెట్ ను ప్రకటించాలని సూచించారు. మంత్రిపదవుల విషయంలోనూ పార్టీలు త్వరగా అవగాహనకు రావాలని కొరారు. ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనను చూడాలనుకుంటున్నారని, కాబట్టి త్వరగా ఆ పనేదో చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజా ట్వీట్ చేశారు.

కర్ణటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపి పార్టీని గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతించి.. బలనిరూపణకు పక్షం రోజుల సమయాన్ని కూడా కేటాయించగా కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది. యడ్యూరప్ప ప్రభుత్వాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం అఘమేఘాల మీద మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా అదేశాలు జారీ చేయడంతో.. ఆయన బలనిరూపణకు ముందే తన రాజీనామా చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇక ప్రమాణస్వీకారం కూడా బీజేపీయేతర పార్టీల బలప్రదర్శనకు, రానున్న సార్వత్రిక ఎన్నికలకు పునాదని కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కోన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash raj  supreme court  kimaraswamy  Siddaramaiah  portfolios  Congress  JD(S)  karnataka  politics  

Other Articles