Petrol, diesel prices fall after 16 straight surge days ఇంధన ధరల పెంపుకు కళ్ళెం.. వాహనదారులకు స్వల్ప ఊరట

Petrol diesel prices cut after 16 days as crude oil softens

petrol diesel price, petrol diesel price today news, petrol diesel price in delhi, petrol diesel price in up, petrol diesel price today, petrol diesel gst, petrol diesel ke rate, petrol diesel ke bhav, petrol diesel ke daam, diesel rate, diesel rate in delhi, diesel price, diesel rate chart, diesel rate today, diesel price in mumbai, petrol price, petrol rate, petrol rate in delhi, petrol price in india, petrol price in mumbai, petrol rate in india

In a much needed relief for people across the country, petrol prices were slashed by 59 paise in Mumbai and 60 paise in Delhi today. Meanwhile, Diesel prices went down by 59 paise in Mumbai and 56 paise in the national capital.

ఇంధన ధరల పెంపుకు కళ్ళెం.. వాహనదారులకు స్వల్ప ఊరట

Posted: 05/30/2018 10:06 AM IST
Petrol diesel prices cut after 16 days as crude oil softens

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత వరుసగా 16 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు ఎట్టకేలకు స్వల్పంగా బ్రేక్ పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లి దేశవ్యాప్తంగా వాహనదారులను బెంబేలెత్తించిన ఇంధన ధరలు ఇవాళ మాత్రం పెరగలేదు. అయితే గత 16 రోజులుగా వాహనదారుల బేజులకు చిల్లులు పెట్టిన ఇంధన ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా స్వల్పంగా ధరలు తగ్గడంతో వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది.

ఢిల్లీలో లీటరు పెట్రోల్ కు 60 పైసలు, ముంబైలో 59 పైసలు, ఢిల్లీలో డీజిల్‌పై 56 పైసలు, ముంబైలో 59 పైసలు తగ్గింది. తగ్గిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.77.83, ముంబైలో రూ.85.65, కోల్‌కతాలో రూ.80.47, చెన్నైలో రూ.80.80కి దిగొచ్చింది. ఇక ఢిల్లీలో బుధవారం లీటర్ డీజిల్ ధర రూ.68.75గా ఉండగా, ముంబైలో రూ.73.20, కోల్‌కతాలో రూ.71.30, చెన్నైలో రూ.72.58గా ఉంది.పెట్రో ధరలు పైసల్లో తగ్గడంపై వాహనదారులు పెదవి విరుస్తున్నారు. రూపాయల్లో పెంచి, పైసల్లో తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జూన్ మొదటి వారానికి లీటర్ పెట్రోల్ రూ.85, లీటర్ డీజిల్ రూ. 76కి చేరుకోవచ్చని అయిల్ రంగ నిపుణులు జోస్యం చెప్పినా.. వారి అంచనాలకు ఇవాళ బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగటంతోపాటు డాలర్ తో రూపాయి మారకం విలువ భారీ పతనం కావటం కూడా ధరలు పెరగటానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఇంధన ధరలపై కేంద్రం విధించిన ఎక్సైజ్ పన్నుపోటును తొలగిస్తే చాలునని ఇప్పటికీ వాహనదారులు కేంద్రాన్ని విన్నవించుకుంటున్నారు. ఇక ఇంధన ధరలు పెరిగిన ప్రతీసారి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని.. ఇదిగో అదిగో.. అంటూ చెబుతూ వస్తున్న ఇంధనమంత్రిత్వ శాఖ.. ముందుగా పెంచిన ధరను తగ్గించే ప్రయత్నాలు చేయాలని కూడా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles