pawan kalyan photos goes viral on net సామాన్యుడిలా జనసేనాని.. విశాఖలో వెలుగులోకి..

Janasena chief pawan kalyan vishaka photos goes viral on net

pawan kalyan, janasena, Pawan Kalyan ambedkar bhavan, pawan kalyan bed, pawan kalyan photos viral, pawan kalyan middle class man, uttatandhra porata yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan is a very well known luxurious person, but lives comfortably in vishaka on an ordinary double cot bed, photos of pawan goes viral on social media.

సామాన్యుడిలా జనసేనాని.. విశాఖలో వెలుగులోకి..

Posted: 05/17/2018 06:56 PM IST
Janasena chief pawan kalyan vishaka photos goes viral on net

ఉద్యమాలకు పురటిగడ్డైన శ్రీకాకుళం జిల్లా నుంచి తన ఉత్తరాంధ్ర పోరాట యాత్రను ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తానని చెప్పిన పవన్ కల్యాన్.. విశాఖలో సామన్య మథ్యతరగతి అతిథ్యాన్ని పోందారు. ఎంతో విలాసవంతమైన జీవితాన్ని చిన్ననాటి నుంచి గడిపిన అయిన.. విశాఖకు చేరుకున్న క్రమంలో మాత్రం సగటు సామాన్యుడిలా జీవించారు. నాయకులు మాటలు చెబుతారు.. కానీ అచరించరు అన్న భావన ఇన్నాళ్లు ప్రజల్లో వుంది. అంతెందుకు నిన్నటికి నిన్న ఉత్తర్ ప్రదేశ్ లో దళితులను మచ్చిక చేసుకునేందుకు ఆ రాష్ట్ర మంత్రులు వేసిన ప్రణాళిక బెడిసికోట్టిన విషయం తెలిసిందే.

దళితుల ఇంట బోజనం చేస్తామని అప్పటికప్పుడు ప్రకటించుకున్న మంత్రివర్యులు తామందరికీ బోజనం సరిపోదని తాను కొంత బోజనాన్ని స్థానిక దాబా నుంచి తెప్పించానని చెప్పగా, అలాంటిదేమీ లేదు.. తాము కాసింత ఉన్నవారమేనని, తమ ఇంటికి వచ్చిన బీజేపి నేతలకు తాము బోజనం పెట్టించగలగే శక్తిసామర్థ్యం తమకు వుందని ఆ ఇంటి యువకుడు చెప్పడం గమనార్హం. అయితే ఇలా ఎందరో నాయకులు ఎన్నో అపసోపాలు పడుతూ తాము చెప్పిన మాటలను మమ అనిపిస్తున్నారే తప్ప.. నిజంగా చిత్తశుద్దితో అచరించడం మాత్రం కనబడదు. వున్నా వారి సంఖ్య చాలా తక్కువ.

అయితే అందుకు పూర్తి భిన్నంగా పవన్ కల్యాన్ అచరణలోనూ అమలుపర్చి.. నిజమైన ప్రజానేతగా మలుచుకుంటున్నారు. తాను చిటికేస్తే చాలు స్టార్ హోటళ్లు కూడా తనకు ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ లను ఏర్పాటు చేస్తాయని తెలిసినా.. వాటికి దూరంగా సామాన్యులలో ఒకడిగా, సాధారణ ప్రజగా మాత్రమే మసలుకోవాలని అయన బాబాసాహెబ్ అంబేధకర్ మెమొరియల్ సోసైటీలో ఓ గదిని తీసుకుని అక్కడే రాత్రి బస చేశారు. ఆయన గదిలోని మంచం.. మంచం పైనున్న పరుపు.. ఆ గదికి వున్న అటాచ్ బాత్ రూం తాలుకు ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles