Congress, JD(S) MLAs Shifted to Hyderabad హైదరాబాద్ కు కన్నడ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు

Congress jd s mlas shifted to hyderabad hotel

congress mlas, jds mlas, hyderabad, kochi, Siddaramaiah, PM Modi, Amit shah, BS Yeddyurappa, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

The Congress and JD(S), fearing its MLAs being poached by the BJP, moved their MLAs out of Karnataka. The Congress MLAs were taken to Hyderabad and JD(S) members were shifted to Kochi on buses

అర్థరాత్రి హైడ్రామా: హైదరాబాద్ కు కన్నడనాట రాజకీయం..

Posted: 05/18/2018 09:45 AM IST
Congress jd s mlas shifted to hyderabad hotel

కర్ణాటకలో కమల పార్టీ వ్యూహాలకు అంతుచిక్కని విధంగా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పై ఎత్తులు వేస్తుంది. విశ్వాస పరీక్షలో నెగ్గడమే లక్ష్యంగా ఆపరేషన్ కమల్ కు కాషాయ పార్టీ తెరలేపిగా.. బీజేపీ వేసే ఎరలో తమ ఎమ్మెల్యేలను పావులుగా మారకుండా.. కాంగ్రెస్-JDS తమ ఎమ్మెల్యేలను కర్ణాటక రాష్ట్రం నుంచి పోరుగురాష్ట్రాలకు తరలిస్తుంది. కమలం పార్టీ బలపరీక్షలో అపజయం పాలైతే కానీ తమకు గవర్నర్ వాజుభాయ్ వాలా నుంచి పిలుపు రాదని భావిస్తున్న పార్టీలు.. ఆ మేరకు బీజేపి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తమ ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

కర్ణాటక గవర్నర్ యడ్యూరప్ప ప్రభుత్వానికి పక్షం రోజుల వ్యవధిని ఇచ్చి బలనిరూపణ చేసుకోవాల్సిందిగా అవకాశం ఇవ్వడంతో.. ఈ సమయం చాల ఎక్కువని భావించిన పార్టీలు ఈ పక్షం రోజుల పాటు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు బీజేపికి మద్దతు పలికితే యడ్యూరప్ప ప్రభుత్వం రెండున్నరేళ్ల వరకు బతికి బట్టకట్టే అవకాశాలు వున్నందున్న.. ఆ అవకాశం వారికి కల్పించకుండా కట్టుదిట్టమైన చర్యలకు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా క్రితం రోజు ఎమ్మెల్యేలను కోచ్చికి తరలించాలని ముందుగా భావించిన కాంగ్రెస్.. జేడీఎస్ ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేలను కొచ్చి తరలించేందుకు రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. కొచ్చిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఎమ్మెల్యేలుండేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు స్పెషల్ ఫ్లైట్ లను కూడా బుక్ చేశాయి. ఎమ్మెల్యేలంతా బస్సుల్లో ఎయిర్ పోర్ట్ కు వెళ్లగా… విమానాలు బయల్దేరేందుకు డీజీసీఏ అనుమతించలేదు. దీంతో అందరినీ రోడ్డు మార్గంలోనే వేరే ప్రాంతానికి తరలించారు. పుదుచ్చేరి, కొచ్చి అని ముందు చెప్పినా… చివరకు వారిని అర్థరాత్రి హైదరాబాద్ తరలించారు. రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడి ట్రావెల్స్ బస్సులోకి ఎమ్మెల్యేలను మార్చారు.

ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరినట్టు తెలుస్తోంది. హోస్పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్… కనిపించకుండా పోయారు. వ్యక్తిగత పనులపై ఆయన ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్, గాలి జనార్ధన్ రెడ్డిలకు ఆయన అత్యంత ఆప్తుడు. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వంలోనే మంత్రిగానూ పనిచేశారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వెళ్లారనే భావన వ్యక్తమవుతోంది. ఇక మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ కూడా రిసార్ట్ కు తిరిగిరాలేదు.

ఆరోగ్యం బాగాలేదని రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులో లేకుండా పోయారు. వీళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరి లతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకర్ రెడ్డి, కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపార్టీ ఎమ్మెల్యే R.శంకర్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగేశ్ లను ఆకర్షించే ప్రయత్నాల్లో కషాయదళం నిమగ్నమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress mlas  jds mlas  hyderabad  kochi  Siddaramaiah  PM Modi  Amit shah  BS Yeddyurappa  Congress  BJP  JDS  Kumara Swamy  karnataka  politics  

Other Articles