Talking on phone while driving not illegal: Kerala HC ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం నేరం కాదు: కోర్టు

Talking on mobile while driving not illegal kerala high court

P Somarajan, motor vehicles act, Mobile phone, Kerala high court, justice Satheesachandran, AM Shaffique, using phone while driving, talking on phone while driving, illegal to use phone while driving, kerala high court, crime

According to the latest ruling from the Kerala High Court, it is not illegal to talk on the phone while driving, unless it is established that the driver's actions endangered public safety.

ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం నేరం కాదు: కోర్టు

Posted: 05/17/2018 05:31 PM IST
Talking on mobile while driving not illegal kerala high court

వాహనాలను నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ పోలీసుల కంటబడితే ఇంకేమైనా వుందా.. వారు వెంటనే ఫోటో తీయడం.. అందుకు గాను జరిమానా విధించడం.. అది నేరుగా ఇంటికి చేరడం అంతా చకచకా జరిగిపోతుంది. ఎందుకోచ్చిన చలానాలు అనుకునే వారు మాత్రం ఫోన్ ఎంత మోగినా దానిని వాహనాలను నడిపే సమయంలో మాత్రం తీయరు. ఇక మరికోందరు ముందుగానే వాటిని ఫ్లైట్ మోడ్ లేదా.. డ్రైవింగ్ మోడ్ లో పెట్టేస్తారు. తీరా పోలీసులకు చిక్కి.. జరిమానాలు ఎందుకు అనవసరంగా కట్టాలి అనుకునే వారు చేసే పనులు ఇవి.

ఇలా కాకుండా మరికోందరు మాత్రం ఏమౌవుతుందిలే అనుకునేవాళ్లు మాత్రం తమ ఫోన్ మోగిన వెంటనే దానిని తీసి ఎంచక్కా మాట్లాడేస్తారు. అయితే ఈ క్రమంలో వారు తమ తోటి వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతుంటారు. పలు సందర్భాలలో ప్రమాదాల బారిన పడటమే కాకుండా తోటి వాహనచోదకులను కూడా ప్రమాదాల బారిన పడేస్తుంటారు. అయితే ప్రమాదాల బారిన పడేయకుండా వాహనాలు నడుపుతూ ఫోన్ మాట్లాడటం తప్పేం కాదని తాజాగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం కాదని పేర్కోంది.

ఔనా అంటూ విస్తుపోతున్నారా..? ఇది నిజంగా నిజం. ఈ మేరకు కేరళ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. చట్టంలో దీనిపై ఎలాంటి నిబంధనలు లేనందున పోలీసులు కేసు నమోదు చేయజాలరని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని ప్రజా భద్రతకు ముప్పు కలిగిస్తున్న వారిగా పేర్కొంటూ... కేరళ పోలీసులు 118 సెక్షన్, 118 (ఇ) కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడేవారిని ప్రజా భద్రతకు ప్రమాదంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కేసు నమోదు చేయదల్చుకున్న పక్షంలో... ఆ మేరకు చట్టాన్ని సవరించి శాసన సభలో ఆమోదించాలని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles