CM Yeddyurappa waives off farmers loans రైతు రుణమాఫీపైనే యడ్యూరప్ప తొలిసంతకం

Loan waiver to benefit 1 lakh farmers says yeddyurappa

BS Yeddyurappa, chief minister, Karnataka Governor, farmers, bjp election manifesto, farm loan waives off, Vajubhai Vala, Siddaramaiah, BS Yeddyurappa oath ceremony, PM Modi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

BS Yeddyurappa, the new Chief Minister of Karnataka has announced farm loan waiver for 1 lakh farmers. Farm loan waiver was part of BJP’s election manifesto.

రైతు రుణమాఫీపైనే యడ్డీ తొలిసంతకం.. అయినా ముళ్లబాటేనా..

Posted: 05/17/2018 11:52 AM IST
Loan waiver to benefit 1 lakh farmers says yeddyurappa

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప.. తాను పయనిస్తున్నది ముళ్లబాటేనని తెలిసి.. గవర్నర్ ఇచ్చిన పక్షం రోజుల గడువులోగా కన్నడ నాట ప్రజలను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన తన తొలి సంతకాన్ని రైతు రుణాల మాఫీ ఫైలుపైనే పెట్టారు. క్యాబినెట్ అమోదం లేకుండా తన ఫైలు ఇంచు కూడా ముందుకు కదలదని తెలిసినా.. ఆయన తన వంతు బాధ్యతను మాత్రం ముందుగా నిర్వహిస్తున్నానంటూ.. ఆయన చెప్పుకోచ్చారు.

రైతు రుణమాఫీతో కర్ణాటకలోని లక్ష మంది రైతులకు లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఏకంగా రైతు రుణమాఫీ కింద 56 వేల లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్నట్లు ఆయన తన తొలిసంతకాన్ని ఈ ఫైలుపై పెట్టి కన్నడిగులను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. రైతు రుణమాఫీ చేస్తామని తాము ఎన్నికల మానిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు తాను తొలి సంతకం చేశానని చెప్పుకోచ్చారు. తన ప్రభుత్వం బలనిరూపణలోనూ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే యడ్యూరప్ప పయనిస్తున్నది మాత్రం ముళ్లబాటలోనేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత అర్ధరాత్రి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బీజేపీకి మద్దతు పలుకుతున్న ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను తక్షణం తమముందు ఉంచాలని ఆదేశించడమే ఇందుకు కారణంగా వారు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాను బీజేపీ ఇవాళ సుప్రీంకోర్టుకు అందించాల్సివుంది. ఇక ఆ వెంటనే ఈ జాబితాలో బీజేపీకి ఉన్న 104 మంది ఎమ్మెల్యేలు కాకుండా, ఎవరెవరు మద్దతు పలుకుతున్నారన్న విషయం బహిర్గతమైతే, కన్నడనాట రాజకీయ ప్రకంపనలు చెలరేగుతాయి.

కర్నాటకలో అధికార కోసం ఏ పార్టీకైన సాధారణ మెజారిటీకి 112 మంది సభ్యుల బలం కావాల్సివుండగా, బీజేపీకి ఇంకా ఎనిమిది మంది మద్దతు అవసరం. ఇప్పటికే ఓ స్వతంత్ర ఎమ్మెల్యే బహిరంగంగానే మద్దతు పలికారు. మరో ఏడుగురిని బీజేపీ ఫిరాయింపుదారులుగా మార్చాల్సి వుంది. వారి పేర్లను ఆ పార్టీ నేడు బహిర్గతం చేయాల్సి వుంది. అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ నుంచి ఫిరాయించేందుకు సిద్ధపడి, అంగీకారం తెలిపిన ఎమ్మెల్యేల వివరాలు బయటకు వస్తే, వారిపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించే ఎమ్మెల్యేల జాబితాలో వారితో సంతకాలు కూడా చేయించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళే యడ్యూరప్ప ప్రభుత్వానికి బలం వుందా.? లేదా.? అన్నది కూడా తేలిపోనుంది.

ఇక సుప్రీంకోర్టులో సమర్పించిన జాబితానే వారు బలనిరూపణలో కూడా రుజువు చేసుకోవాల్సి వుంటుంది. బలనిరూపణలో ఆ పేర్లను మార్చే వీలు వుండకపోవడంతో.. బీజేపీకి చాలా ఇబ్బందులు కలిగించే పరిణామమని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించి, గవర్నర్ వాజుభాయ్ వాలా ఇచ్చిన పక్షం రోజుల సమయం ఇచ్చినప్పటికీ, మరింత ఆలస్యం చేయకుండా వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, బలాన్ని నిరూపించుకోవాలన్నది యడ్యూరప్ప ఆలోచనగా తెలుస్తోంది. వీలైతే శుక్రవారమే, కాకుంటే శనివారం అసెంబ్లీని సమావేశపరచాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles