Rajan rules himself out for top job ఆ కీలక బాధ్యతలు వద్దూ: రఘురాం రాజన్

Raghuram rajan says won t apply for top bank of england job

raghuram rajan, Bank of England, Mark Carney, University of Chicago, UK, Reserve Bank of India, RBI, central bank, Philip Hammond, economics

Raghuram Rajan said he doesn’t plan to apply for the job of Bank of England governor, which Mark Carney will leave in just over a year.

ఆ కీలక బాధ్యతలు వద్దూ: రఘురాం రాజన్

Posted: 05/17/2018 12:48 PM IST
Raghuram rajan says won t apply for top bank of england job

భారత అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తన శాయశక్తులా కృషి చేసిన భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేతికి కీలక పగ్గాలు అందబోతున్నాయన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం కాగా, ఇదే విషయమై రాజన్ స్పందిస్తూ తాను ఎలాంటి కీలక బాధ్యతలను చేపట్టబోయేది లేదని కరాఖండిగా చెప్పేశారు. తాను కీలక పగ్గాల కోసం దరఖాస్తు కూడా చేయాలని భావించడం లేదని చెప్పారు. అంతేకాదు తనకు బోధనావృత్తిలోనే అత్యంత సంతృప్తి వుందని ఆయన చెప్పేశారు.

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా పదవీ బాధ్యతలను చేపట్టి.. భారత అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన రాజన్.. వచ్చే సంవత్సరం ఖాళీ అయ్యే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవిని చేపడతారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆయన తోసిపుచ్చారు. తనకు బ్యాంకు అప్ ఇంగ్లాండ్ గవర్నర్ బాధ్యతలను చేపట్టాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆ పదవి కోసం దరఖాస్తు చేయాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కెనడా సెంట్రల్ బ్యాంక్ హెడ్ గా పనిచేసి, ఆపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా వచ్చిన మార్క్ కార్నే జూన్ 2019లో పదవీ విరమణ చేయనుండగా, ఆయన వారసుడిగా రాజన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

"ప్రస్తుతం షికాగో యూనివర్శిటీలో నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను. నాకు బోధించడమంటేనే ఇష్టం. నేనేమీ నిష్ణాతుడినైన బ్యాంకర్ ను కాదు. ఇక్కడ నాకు ఆనందంగా ఉంది" అని యూఎస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్, లండన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను చెప్పగలిగింది ఇంతేనని, తాను మరెక్కడా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే పరిస్థితి లేదని రఘురాం రాజన్ అన్నారు.

కాగా, బ్రిటన్ ఆర్థికమంత్రి ఫిలిప్ హమాండ్ ఇటీవల మాట్లాడుతూ, ఈ సంవత్సరమే కార్నే వారసుడి ఎంపిక ఉంటుందని, ఈ పోస్టుకు విదేశీయుల పేర్లను కూడా పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించిన తరువాత రఘురాం రాజన్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుకు బ్యాంక్ ఆఫ్ ఇంటర్నెేషనల్ సెటిల్ మెంట్స్ జనరల్ మేనేజర్ అగస్టిన్ కార్స్ టెన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాజీ డిప్యూటీ గవర్నర్ మినౌచ్ షఫీక్,  స్టాండర్డ్ యూకే చైర్మన్ శృతీ వదేరా పేర్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles