Sidda tearful as party leaders pin blame on him కంటతడి పెట్టిన సిద్దూ.. బీజేపిపై మండిపాటు

Karnataka elections 2018 bad show reduces ex cm to tears

Siddaramaiah, tears, congress meet, BS Yeddyurappa, Amit Shah, Rahul Gandhi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

With the High Command’s diktat to forge an alliance with the Gowda-led JD(S) whom he has detested all the time, Siddaramaiah on Wednesday turned emotional and was seen weeping during the legislative party meeting at the KPCC office in Bengaluru.

కంటతడి పెట్టిన సిద్దూ.. బీజేపిపై మండిపాటు

Posted: 05/17/2018 10:56 AM IST
Karnataka elections 2018 bad show reduces ex cm to tears

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకున్న ధీమా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తుడిచిపెట్టుకుపోవడంపై తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. అవేదన వ్యక్తం చేశారు. కర్నాటక రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి, సంక్షేమానికి తాను ఫలు విధాలుగా పాటుపడినా.. వారు తన సేవలను విస్మరించారని, కేవలం కుల, జాతుల ప్రాతిపదికన ఓట్లే వేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్‌ చేసిన కృషిని ఎవరూ పట్టించుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

బెంగళూరులోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో తన బాధనంతా వెళ్లగక్కారు. ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నా. ప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను విస్మరించి కులాలు, జాతుల అంశానికే ప్రాధాన్యమిస్తూ జనం మమ్మల్ని ఓడించారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తమ ప్రణాళికను ప్రజలే మార్చేశారంటూ ఆయన బాధను వెళ్లగక్కారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడాలంటే కాంగ్రెస్‌, దళ్‌ శాసనసభ్యులెవరూ బీజేపిలోకి వెళ్లవద్దని సిద్దరామయ్య పిలుపునిచ్చారు.

ఎన్నికలలో తమ అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా బీజేపి శ్రేణులు, కేంద్రమంత్రులు అందరూ నానా విధాలుగా తూలనాడిన అనంతరం.. వారితో ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ లేనప్పటికీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని... ఇదే అంశంపై తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. బీజేపీ చేస్తున్న దారుణ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. యెడ్యూరప్ప తన మెజారిటీ నిరూపించు కోవాలనుకుంటే... ముందు 112 మంది ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని సవాల్ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  tears  congress meet  BS Yeddyurappa  Amit Shah  Rahul Gandhi  Congress  BJP  JDS  Kumara Swamy  karnataka  politics  

Other Articles