Holy month of Ramadan begins today పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..

Holy month of ramadan begins today

islam, ramadan, muslims, holy month, fastings, haleem, ramadan, ramzan, ramadan 2018, how muslims are observing ramadan, ramadan 2018 india, ramadan mubarak, ramadan quotes, ramadan wishes, ramadan 2018 date, ramadan 2018 time table

Local clerics declared today as the first day of Ramadan, after failing to see the crescent moon last Tuesday night that would have signaled its start yesterday.

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. కనిపించిన నెలవంక

Posted: 05/17/2018 10:03 AM IST
Holy month of ramadan begins today

మహ్మదీయ సోదరుల పవిత్ర రంజాన్ మాసం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. ‘చాంద్ ముబారక్’ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మహ్మదీయులు ఉపవాస దీక్షలను ప్రారంభసన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఆకాశంలో నెలవంక కనిపించిన వెంటనే చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని మసీదుల నుంచి రంజాన్ మాసం ప్రారంభ సైరన్ మోతలు వినిపించాయి.

మంగళవారం రాత్రి ఆకాశంలో రంజాన్ మాసం చంద్రవంక కనిపించని కారణంగా బుధవారం ప్రారంభం కావాల్సిన రంజాన్ మాసం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక బుదవారం నెలవంక కనిపించడంతో పవిత్ర మాసం ప్రారంభమైందని రూహిత్ ఇలాల్‌ కమిటీ ప్రతినిధులు ప్రకటించడంతో మక్కా మసీదులో తరావీ నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ మాసం ప్రారంభ సూచకంగా జంట నగరాల్లో ప్రార్థనలు నిర్వహించారు. గురువారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇదిలావుండగా, రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు కూడా మహ్మదీయ సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : islam  ramadan  muslims  holy month  fastings  haleem  ramzan  

Other Articles