Yeddyurappa sworn in as karnataka CM కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

Bs yeddyurappa takes oath as cm amid protest by congress jds

BS Yeddyurappa, chief minister, Karnataka Governor, Vajubhai Vala, Siddaramaiah, BS Yeddyurappa oath ceremony, PM Modi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

BJP leader and Lingayat strongman BS Yeddyurappa was on Thursday sworn-in as the new Chief Minister of Karnataka by Governor Vajubhai Vala.

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

Posted: 05/17/2018 09:27 AM IST
Bs yeddyurappa takes oath as cm amid protest by congress jds

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపికి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం కల్పించారు కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా. దీంతో ముందుగా అనుకున్నట్లు మధ్యాహ్నం 12.10 నిమిషాలకు కాకుండా ఉదయం తొమ్మిది గంటలకే పార్టీ శ్రేణులతో కలసి రాజ్ భవన్ వెళ్లిన యడ్యూరప్ప ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా సీఎంగా మూడో పర్యాయం ప్రమాణస్వీకారం చేశారు. ఫలితాలు వెలువడిన తరువాత నుంచి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని చెబుతూ వచ్చిన యడ్యూరప్ప.. అనుకున్నట్లుగానే ప్రమాణస్వీకారం చేశారు.

బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. "బీఎస్ యడ్యూరప్ప అనే నేను..." అంటూ ఆయన ప్రమాణ స్వీకారం కన్నడంలో సాగింది. ఆపై ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ శ్రేణులు యడ్యూరప్పకు, బీజేపీకి జయజయధ్వానాలు పలికాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.

క్రితం రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు.. ఆ తరువాత అర్థరాత్రి నుంచి ఉదయం వరకు సాగిన హైడ్రామాల మధ్య గవర్నర్ యడ్యూరప్పను పిలిచి ఇవాళ హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే ఈ ప్రమాణస్వీకారోత్సవంలో కేవలం యడ్యూరప్ప మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. క్యాబినెట్ మంత్రులుగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయకపోవడం గమనార్హం. కాగా గవర్నర్ యడ్యూరప్పకు పక్షం రోజుల సమయం ఇచ్చారు. ఈలోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు.

పక్షం రోజుల వ్యవధిలో యడ్యూరప్ప తన బలాన్ని అసెంబ్లీ వేదికగా నిరూపించుకోని పక్షంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని పిలిచే అవకాశం వుంది. అయితే పక్షం రోజుల వ్యవధిలో ప్రతిపక్ష పార్టీల నుంచి పలువరు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని, తమకు మద్దతు ఇస్తారని బీజేపి అశాభావంతో వుంది. మరి బీజేపి అశలు ఫలించేనా అన్నది పక్షం రోజులు అగాల్సిందే. అయితే గవర్నర్ యడ్యూరప్పను ప్రమాణస్వీకారోత్సవానికి పిలవడం కూడా పలు విమర్శలకు దారితీస్తుంది. ఇదిలావుంటే ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు యడ్యూరప్ప రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BS Yeddyurappa  chief minister  Karnataka Governor  Vajubhai Vala  karnataka  politics  

Other Articles