CM Biplab Deb to Delhi over his remarks ఢిల్లీ నుంచి సీఎం విప్లవ్ దేవ్ కు పిలుపు..

Pm modi summons tripura cm biplab deb over controversial remarks

tripura, biplab kumar deb, BJP, Narendra Modi, northeast India, Netzens, social media, karnataka elections, pan shops, milk cows, Politics

PM Modi has "summoned" Biplab Kumar Deb to New Delhi on May 2 after a string of random remarks by the Tripura CM left his party colleagues redfaced and his rivals in splits.

ఢిల్లీ నుంచి సీఎం విప్లవ్ దేవ్ కు పిలుపు.. అడేసుకుంటున్న నెట్ జనులు

Posted: 04/30/2018 05:21 PM IST
Pm modi summons tripura cm biplab deb over controversial remarks

ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి చేసే ప్రకటనలు, మాట్లాడే మాటలు.. ప్రజలను మెప్పించేలా వుండాలి తప్ప.. నొప్పించేలా వుండకూడదన్న విషయం తెలిసినా.. మరి ఈ ముఖ్యమంత్రి మాత్రం గత రెండు మూడు వారాలుగా వార్తల్లో నిలుస్తూ.. మరీ ముఖ్యంగా నెట్టింట్లో నెట్ జనుల విమర్శలను ఎదుర్కోంటున్నారు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు అదుపుతప్పి మాట్లాడకూడదని ప్రధాని మోదీ తమ పార్టీ నేతలు సూచించినా ఈ ముఖ్యమంత్రి మాత్రం అనవసర విషయాల్లో నోరుజారుతూ పతాకశీర్షికలకు ఎక్కుతున్నాడు. దీంతో ఆయను మే 2న ఢిల్లీకి రావాలని అధిష్టానం కబురుపంపింది.

ఆ ముఖ్యమంత్రి మరెవరో కాదు.. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్. ఆయన గత రెండుమూడు వారాలుగా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు. దీంతో ఆయన వ్యవహరమై మండిపడుతున్న పార్టీ అధిష్టానం కూడా ఆయన వ్యాఖ్యలను మండిపడింది. మే 2న ఢిల్లీకి రావాలని ఆయనకు పార్టీ కబరు పంపింది. ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడుతున్న రాష్ట్ర బీజేపి అగ్రనేతలు వాటిని సమర్థించలేక.. ఖండించనూ లేక చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇక లాభం లేదని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయనకు మే 2న హస్తినకు రావాలని అధిష్టానం కబరుపంపింది.

ఇక బీజేపీ నేతలు అనేక మంది విప్లవ్ దేవ్ వ్యాఖ్యల విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాని మోదీజీ ఆయనతో మాట్లాడతారని బీజేపీ సీనియర్ నేత ఒకరు మీడియాకు సమాచారం అందించారు. దేవ్ వ్యాఖ్యలు కర్ణాటక ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పలువురు ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల త్రిపుర ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారే గానీ, అనవసర వివాదాలు సృష్టించాలని కాదని ఓ బీజేపీ నేత తెలిపారు.

ఇంటెర్నెట్ రామాయణ కాలం నుంచే వుందని తొలిసారిగా వివాదాస్పద వ్యాక్యలు చేసిన ముఖ్యమంత్రి.. ఆ తరువాత డయానా హెడెన్ తెల్లగా లేకపోయినా ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం ఎలా ఇచ్చారని.. ఇక రాష్ట్రంలోని నిరుద్యోగ యువత..  ఉద్యోగాన్వేషణ కోసం సమయం వృథా చేసుకోకుండా ఆవులు, పందుల పెంపకం ద్వారా ఉపాధి పొందాలని, పాన్ షాపులు పెట్టుకోవాలంటూ విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles