Will go to Kailash Mansarovar: Rahul Gandhi మానస సరోవర్ కు వెళ్తానన్న రాహుల్

I thought it s all over rahul gandhi to go on pilgrimage after flight scare

Jan Akrosh rally, Rahul Gandhi, Kailash Mansarovar, Pilgrimage, Karnataka Polls, Congress president, Congress, Nirav Modi, Sonia Gandhi, bharatiya janata party, China, Salman Khurshid, NEW DELHI, Amit Shah, Assam, Ghulam Nabi Azad, Jammu, Piyush Goyal, politics

Congress president Rahul Gandhi announced that he would take a 15-day break from politics immediately after the May 12 Karnataka elections to go on a pilgrimage to Kailash Mansarovar.

పక్షం రోజుల సెలవివ్వండీ.. మానస సరోవర్ కు వెళ్తానన్న రాహుల్

Posted: 04/30/2018 05:58 PM IST
I thought it s all over rahul gandhi to go on pilgrimage after flight scare

కర్ణాటకలోని హుబ్బళి విమానాశ్రయంలో తాను తన కాంగ్రెస్ నేతల టీమ్ తో ప్రయాణిస్తున్న క్రమంలో సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండైన ఘటనను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆది భయానక ఘటనగా అభివర్ణించారు. తాను ఆ విమానంలో వుండటంతో.. అందరితో పాటు తాను కూడా భయాందోళన చెందనాని, ఇక తన పని అయిపోయిందని అనుకున్నానని అన్నారు. విమానంలోని ప్రయాణికులు అందరూ భయంతో గుండెలు అరచేతిలో పెట్టుకుంటే రాహుల్ మాత్రం నిబ్బరంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు, రాహుల్ ఎస్ రవి, విద్యార్థి తదితరులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

స్వతహాగా ఒక పైలెట్ అయిన రాహుల్ క్రూ క్యాబిన్ లోకి వెళ్లి పైలెట్లకు విమానాన్ని సురక్షింతంగా దిందచడంలో సాయపడ్డారని కూడా ట్విట్ లో పేర్కోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన జనాక్రోశ్ సభలో రాహుల్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక తన పని అయిపోయిందని అనుకున్నానని తెలిపారు. అప్పుడే తనకు మానస సరోవర్ లోని శివాలయాన్ని దర్శించాలని మొక్కుకున్నానని రాహుల్ చెప్పారు.

తాను ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 8 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు జారడంతో విమానం క్రాష్ అవుతుందని.. ఇక అంతా అయిపోయింది అని కూడా అనుకున్నానని పేర్కొన్నారు. ఆ సమయంలో భగవంతుడిని స్మరించుకున్నానని, కైలాస్ మానస సరోవర్‌ను సందర్శిస్తానని కూడా మొక్కుకున్నానని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో కర్ణాటక ఎన్నికలు ఈ నెల 12న జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికలు ముగిసిన తరువాత.. మానస సరోవర్ లోని కైలాష్ నాథ్ అలయ సందర్శనకు వెళ్తానన్నారు. అందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు తనకు 15 రోజుల సెలవును ఇవ్వాలని అనుమతి కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles