Bengaluru Cop shoe throwing video goes viral ఈ కానిస్టేబుల్ చేసిన పనికి మీరేంటారు..?

Bengaluru cop throws shoe at bikers for not wearing helmets

Viral video, Bengaluru police, shoe, Bengaluru Traffic Police, bengaluru cop throws shoe at bikers, bengaluru constable suspended

A Bengaluru traffic constable has been suspended after he was caught on camera throwing a shoe at two bikers for not wearing a helmet.

ITEMVIDEOS: హెల్మట్ లేదని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశాడో.. చూడండీ

Posted: 04/30/2018 04:04 PM IST
Bengaluru cop throws shoe at bikers for not wearing helmets

హైదరాబాద్ నగరంలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతుంటే.. పోలీసులు వారిని ఫోటో తీస్తారు..? అదేంటి అంటే ఆ ఫోటోతో మీకు పైన్ పడినట్లే. హైదరాబాద్ నగరం కాకుండా ఇతర నగరాల్లో అయితే పోలీసులు బైక్ ను అపి చలానా రాస్తారు.. మరీ ఓవర్ యాక్షన్ చేస్తే బైక్ పట్టుకెళ్తారు.. అయితే వాహనదారుడు అప్రమత్తమై అపకుండా వెళ్తే.. నెంబర్ నోట్ చేసుకుంటారు.? అంతేకానీ.. ఈ ట్రాపిక్ కానిస్టేబుల్ ను చూసారా.. ఏంచేస్తున్నాడో. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ఈ కానిస్టేబుల్ ఏకంగా వాహనదారుడిపైకి ఏం విసిరాడో తెలుసా..?

ఆ మధ్య ఇలానే యువత హెల్మెల్ లేకుండా వెళ్తున్నారని తమిళనాడులోని ఓ పోలీసు అధికారి వారిపై ఏకంగా పోలీసు లాఠీతో బలంగా కొట్టి.. వారు అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడి.. గాయాలపాలైన ఘటన నేపథ్యంలో సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసినా.. అక్కడేదో జరిగింది.. ఇక్కడ మాత్రం జరగదు అనుకుంటే పోరబాటే. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుద్దీ అని మరోమారు స్పష్టమవుతుంది. అది సరే మరీ కానిస్టేబుల్ ఏం విసిరాడు.? అని అడుగుతున్నారు కదూ.. హెల్మెట్ లేదని కానిస్టేబుల్ తన కాలి చెప్పుతో వాహనదారుడిని కొట్టి తమిళనాడు ఘటన మాదిరిగానే సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. రిషాబ్ చటర్జీ అనే వాయిద్య కళాకారుడు బెంగళూరు సిటీలో కారులో ప్రయాణిస్తున్నాడు. అతని కారు డ్యాష్ బోర్డ్ కు కెమెరా ఉంది. అతను బెంగళూరు రోడ్ నెంబర్ 62 నుంచి వెళుతున్నాడు. ఓ టూర్న్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో వేగంగా వస్తున్న ఓ బైక్ పై ఇద్దరు కుర్రోళ్లు ఉన్నారు. ట్రాఫిక్ పోలీస్ ను చూసి కూడా స్పీడ్ తగ్గించలేదు. ఇది గమనించిన ట్రాఫిక్ కాప్.. వెంటనే తన కుడి కాలు బూటు తీసి వారి ముఖాన కొడతాడు. ఈ బూటు వెళ్లి సరిగ్గా ఆ కుర్రోళ్ల ముఖానికి తగుతుంది. ఆ దాడితో వారి బైక్ బ్యాలెన్స్ తప్పినా.. వెంటనే అలర్ట్ అయ్యి అదే స్పీడ్ తో వెళ్లిపోతారు.

ట్రాఫిక్ పోలీస్ కాలి బూటు తీయటం.. బైకర్స్ పైకి విసరటం అంతా కారు డ్యాష్ బోర్డ్ లోని కెమెరాలో బందీ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ ఏప్రిల్ 24వ తేదీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావటంతో వైరల్ అవుతోంది. పోలీసుల తీరు ఇలా ఉంటే.. వారిపై మంచి అభిప్రాయం ఎలా ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇలాంటి గుణపాఠాలు సరైనవని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles