Bharti Airtel Launches Rs 129 Prepaid Plan అద్భుతమైన ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్..

Airtel rs 129 prepaid plan with free data hello tunes and unlimited calls

airtel, airtel rs 129 recharge pack, airtel rs 129 plan, airtel rs 129 recharge plan, airtel recharge plans, airtel unlimited calling plans, airtel, airtel best recharge packs under rs 150

Airtel has launched a new Rs 129 recharge pack that promises a free subscription to Hello Tunes, alongside unlimited voice calls for a period of 28 days.

అద్భుతమైన ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్.. జియేనే టార్గెట్..

Posted: 04/30/2018 03:27 PM IST
Airtel rs 129 prepaid plan with free data hello tunes and unlimited calls

టెలికమ్యూనికేషన్ రంగంలో అందులోనూ మరీముఖ్యంగా మోబైల్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో కస్టమర్లను పెంచుకోవాలన్నదే.. మార్కెట్లో రారాజులుగా నిలదొక్కుకోవాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతన్న టెలికాం కంపెనీలు.. రోజుకో కొత్త ప్లాన్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇతర సంస్థలపై పైచేయి సాధించి.. తమ కస్టమర్లను గుప్పిట్లో పట్టుకునే ఇతర టెలికాం సంస్థల కస్టమర్లకు గాలం వేసేందుకు పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే ఒక్కో టెలికాం సంస్థ ఒక్కో విధంగా తమ ప్లాన్ లను రూపోందించి కస్టమర్లను అకర్షిస్తుంది.

మరీ ముఖ్యంగా లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లెటెస్టుగా కస్టమర్లను తనవైపు అకర్షించిన రిలయన్స్ జియో.. మిగతా టెలికాం సంస్థల కస్టమర్లను అకర్షించడంలో పెద్దపీట వేసింది. అయితే ఇప్పటికీ టెలికాం సంస్థల రంగంలో అగ్రగామిగా వున్న ఎయిర్ టెల్ కు జియోకు మధ్య పోటీ తీవ్రంగానే వుంది. ఇందులో భాగంగానే ఎయిర్ టెల్ కంపెనీ ఇప్పుడు డేటా టారిఫ్‌ప్లాన్లనుంచి తన ఫోకస్‌ను హలో ట్యూన్స్‌ సెగ్మెంట్‌ వైపు మళ్లించింది. కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో ఫ్రీ డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఉచిత హలో ట్యూన్లను కూడా అందిస్తుంది. రూ.219 ప్లాన్‌ తరహాలోనే మరో కొత్త ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.

టెలికాం టాక్ నివేదిక ప్రకారం రూ. 129 రీఛార్జ్‌తో కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్‌కాలింగ్‌ , రోజుకు 1GB, 4GB డేటా, 100 SMS స్‌లు ఫ్రీ. దీనికి అదనంగా ఎయిర్‌టెల్‌ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే 219 రూపాయలతో ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.4 GB,3G లేదా 4G డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. అంటే మొత్తంగా 39.2GB డేటాను యూజర్లు పొందనున్నారు.డేటాతో పాటు ‘హలో ట్యూన్‌’ బెనిఫిట్స్ ను, కాలింగ్‌, SMS ప్రయోజనాలు ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : airtel  rs 129 recharge pack  prepaid plan  reliance jio  telecom companies  

Other Articles